English | Telugu

లంగావోణీలో అల్లాడించిన ఇంద్రజ..పాతికేళ్ళు వెనక్కి వెళ్లిపోయారంటూ కామెంట్స్

శ్రీదేవి డ్రామా కంపెనీ మిగతా కామెడీ షోస్ తో సమానంగా పోటీ పడుతూనే ఉంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రసారమయ్యే ఈ షోకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఫన్‌, ఎంటర్‌టైన్‌, మెసేజ్‌ ఒరియెంటెడ్‌ స్కిట్స్‌ అన్ని కలగలసిన ఒక అద్భుతమైన కామెడీ షో ఇది. ఈ షోకి రష్మీ యాంకర్ జడ్జి ఇంద్రజ. ఇక ఇప్పుడు రాబోయే వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "ముఖచిత్రం" డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌తో కలిసి వచ్చింది హీరోయిన్ ప్రియా వడ్లమాని. హైపర్‌ ఆది ఆమెను టీజ్ చేయడానికి ట్రై చేసాడు కానీ వర్కౌట్ కాలేదు.

ఇక షోలో భాగంగా.. ఇంద్రజ తన డ్యాన్స్‌తో స్టేజిని అల్లాడించింది. ఇంద్రజకి ఆల్రెడీ డాన్స్ మీద మంచి పట్టు ఉంది. ఎలాంటి డాన్స్ ని ఐనా అవలీలగా చేసేస్తుంది. రాబోయే వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో తన డ్యాన్స్‌తో అందరిని ఎంటర్టైన్ చేసి అలరించింది. ప్రియమైన నీకు సినిమాలోని "మనసున ఉన్నది" అనే పాటకు లంగా ఓణీ వేసుకుని డ్యాన్స్‌ చేసింది ఇంద్రజ.." ఈ పాటతో పాతికేళ్ళు ముందుకెళ్లారు అంత బాగా చేశారు" అని ఆది మంచి కంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత జీన్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని "గజినీ సినిమాలోని.. "రహతుల్ల రహతుల్ల " పాటకు మంచి ఎనెర్జీతో డాన్స్ చేసింది ఇంద్రజ.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.