English | Telugu
బిగ్ బాస్ హౌస్ లో సస్పెన్స్!
Updated : Dec 9, 2022
బిగ్ బాస్ ఈ సీజన్ గ్రాండ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సీజన్ ముగింపుకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సీజన్ విజేత ఎవరు అనే సస్పెన్స్ అందరిలోను మొదలైంది.
కాగా ఒక్కో కంటెస్టెంట్ తమ బెస్ట్ ఇస్తూ వస్తోన్నారు. ఎవరూ తగ్గకుండా వారి వారి పర్ఫామెన్స్ ఇస్తున్నారు. హౌస్ లో మొత్తంగా ఇప్పుడు ఏడుగురు ఉన్నారు. అయితే అందరిలో రేవంత్ ప్రతీ నామినేషన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నాడు. దీంతో రివ్యూయర్స్ అందరూ తనే ఈ సీజన్ విజేత అని అనుకుంటున్నారు. కానీ ఇదంతా సస్పెన్స్ థ్రిల్లర్ లా మారింది. కారణం హౌస్ లో ఉన్నంత సేపు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఒక వెలుగు వెలిగిన గీతూనే బయటకు పంపించేసారు ప్రేక్షకులు. అయితే రేవంత్ అగ్రెసివ్. ఇంకా మాటలు జారుతూ ఉంటాడు. ఇది ఎక్కువ అయిందంటే ప్రేక్షకులు కూడా ఓట్లు వేయడం మానేస్తారు అని అనుకుంటున్నారు.
అయితే రేవంత్ కాకుండా ఇంకా ఎవరు ఈ సీజన్ విజేత అవుతారంటే అది కచ్చితంగా రోహిత్ అనే చెప్పాలి. ఎందుకంటే రోహిత్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ అధిగమించలేదు. కావాలని ఎవరితో గొడవలకు వెళ్ళలేదు. ఎవరితోనూ రూడ్ గా మాట్లాడలేదు. ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా. ఇతనే ఈ సీజన్ విజేతగా నిలిచే ఛాన్స్ లు లేకపోలేదు. అయితే శ్రీహాన్ బాగానే పర్ఫామెన్స్ ఇచ్చినా విన్నర్ మెటీరియల్ కాదనే అంటున్నారు విమర్శకులు. ఎందుకంటే శ్రీహాన్ ప్రతీసారీ శ్రీసత్య, రేవంత్ తో గొడవలు పెట్టుకోవడం అనేది ప్రేక్షకులకు చికాకును తెప్పిస్తున్నాయి. ఇక ఆదిరెడ్డి, శ్రీసత్య, కీర్తి భట్ లు ఉన్నా కూడా వారు పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వట్లేదనే చెప్పాలి. మొత్తానికి ఈ సీజన్ విజేత ఎవరు? అనే ఈ సస్పెన్స్ వీడాలంటేఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.