English | Telugu
ఆర్జీవీ హీరోగా చేసే సినిమాలో విలన్ ఎవరో తెలుసా ?
Updated : Dec 9, 2022
ఆర్జీవీని హీరోగా పెట్టి మీరే సినిమా డైరెక్ట్ చేయాల్సి వస్తే అందులో విలన్ గా ఎవరిని పెడతారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన్నే విలన్ గా పెట్టి డ్యూయల్ రోల్ చేయిస్తా అని ఆన్సర్ ఇచ్చారు కృష్ణ భగవాన్. కమెడియన్ కృష్ణ భగవాన్ స్మాల్ స్క్రీన్ మీద అన్ని రకాల షోస్ లో కనిపిస్తూ ఆడియన్స్ ని తన టైమింగ్ కామెడీతో అలరిస్తున్నారు.
ఇక ఈయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని వెరైటీ ఆన్సర్స్ ఇచ్చారు. "నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే నటుడిగానే పుట్టాలని అనుకుంటున్నా ఎందుకంటే నాకు ఈ నట జీవితం పెద్దగా సాటిస్ఫాక్షన్ గా లేదు. ఇప్పటివరకు చేసినవి ఏవీ కూడా బాగా చేయలేదు అందుకే మళ్ళీ మొదటి నుంచి మంచిగా చేసుకుని వద్దామని అనుకుంటున్నా. లేదా అసలు మరో జన్మ అనేదే వద్దు..ఐతే నాలో సడన్గా ఆధ్యాత్మికత ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో చిన్నప్పుడు అందరూ పూజలు అవీ చేసేవారు.
తర్వాత పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఆ టైంలో నాకు ఎవరో షిర్డీ సాయి బాబా గురించి చెప్పారు. ఆయన్ని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుందని ఆయన కొన్ని లీలల ద్వారా నాకు అప్పుడు అర్ధమయ్యింది. అలా రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశా..అప్పుడు అర్ధమయ్యింది జీవితం అంటే ఏమిటి..నేను అంటే ఏమిటి అని అలా ఆధ్యాత్మికత వైపుకు నా దృష్టి మళ్లింది" అని చెప్పారు కృష్ణ భగవాన్.