English | Telugu

రుణం పేరుతో దారుణాలు చేసే అత్తగా ఆమని!

రుణం పేరుతో దారుణాలు చేసే అత్తగా ఆమని బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీ తెలుగులో త్వరలో కొత్త సీరియల్ రాబోతోంది. దాని పేరు 'ముత్యమంత ముద్దు'. అందులో వడ్డీకి డబ్బులు ఇచ్చి, తర్వాత ముక్కుపిండి మరీ వసూలు చేసే మహిళగా ఆమని కనిపించనున్నారు. ఆమె కుమారుడేమో కన్నవాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేది సీరియల్ లో చూడాలి. త్వరలో ఈ సీరియ‌ల్ ప్రసారం కానుంది. దీనికి 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టితో ప్రచారం చేస్తున్నారు.

'ముత్యమంత ముద్దు' సీరియల్ కాన్సెప్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఓ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడికి కృతి శెట్టి వస్తుంది. పక్కనున్న నిషా రవిక్రిష్ణన్ (సీరియల్ హీరోయిన్)తో 'పెళ్లి తర్వాత అమ్మాయి జీవితమే మారిపోతుంది కదా. ఇంటిని వదులుకోవాలి. ఇంటి పేరు మార్చుకోవాలి. అమ్మానాన్నను దాదాపు మర్చిపోవాలి' అంటుంది.

అప్పుడు కృతితో నిషా రవిక్రిష్ణన్ 'నువ్వు అమ్మాయి గురించి యోచన చేస్తూ ఉండావు. నాను అమ్మాయి అప్పా అమ్మ గురించి బాధ పడుతూ ఉన్నాను. వీళ్లకు కొడుకులు లేరు. మాలాగా ఇద్దరూ కూతుళ్లే. ఇన్నాళ్లూ కూతుళ్లే ప్రాణంగా బతికేశారు. ఇప్పుడు అత్తారింటికి పోయేది కూతురు కాదు. వాళ్ళ ప్రాణం. ఈ క్షణం నుండి ఆ అమ్మ అప్పా అనాథలే కదా. నాకు మాత్రం అలా కాదు. అబ్బాయి పెళ్లి చేసుకుని అమ్మ అప్పాను వదిలేస్తాడా? వాళ్లతో కలిసే కదా ఉంటాడు. అట్నే నన్ను చేసుకోబోయేవాడు కూడా మా అమ్మ, అప్పాను అత్తారింట్లో ఉండనిస్తేనే నేను పెళ్ళికి ఒప్పుకుంటా' అంటుంది.

నిషా రవిక్రిష్ణన్ కండిషన్లకు సిద్దు ఓకే అంటాడు. 'అబ్బాయి సరే. కానీ, నీకు కాబోయే అత్తగారు ఈ కండిషన్ కు ఒప్పుకుంటారా?' అని కృతి ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆమని ఎంట్రీ. పెళ్లింట్లో సారెను తీసుకెళ్లే కర్కశమైన మహిళగా ఆమనిని చూపించారు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీరియల్ ఎలా ఉంటుందో టెలికాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.