English | Telugu

ఇమ్మూకి పెళ్లి ప్రపోజల్.. వైర‌ల్ అయిన వీడియో

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. అసలు ఎలాంటి గుర్తింపు లేనివాళ్లు కూడా ఈ వేదిక మీదకు వచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ షో ద్వారా సుధీర్, రష్మీ, ఆది, వర్ష, ఇమ్మానుయేల్.. ఇలా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు జబర్దస్త్ వేదిక మీద పెర్ఫార్మ్ చేసే కమెడియన్స్ అందరూ కూడా వేరే షోస్ కి వెళ్లి అక్కడ కూడా సందడి చేస్తున్నారు. ఆ క్ర‌మంలో శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న "జాతిరత్నాలు" స్టాండప్ కామెడీ షోకి వచ్చి ఎంటర్టైన్ చేసాడు ఇమ్మానుయేల్‌. ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఈ ప్రోమోలో అందరూ ఎవరి స్కిట్స్ లో వాళ్ళు కామెడీని పండించారు. ఐతే ఈ షోలో ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి ఇమ్మూకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ప్రోమోలో అందరూ ఎవరి స్కిట్స్ తో వారు కామెడీ పండించినప్పటికీ, ఓ లేడీ ఫ్యాన్ ఇమ్మానుయేల్ కి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం హైలైట్ గా నిలిచింది. "ఆకాశంలో వెళ్తుంది రాకెట్టు.. నీకోసం నా లైఫ్ ని పెడతాను తాకట్టు" అని ప్రపోజ్ చేసింది ఆ అమ్మాయి.

ఆమె మాటలు విన్న ఇమ్మానుయేల్ "పెళ్లి చేసుకుంటానంటే చెప్పు?" అని అడిగేసరికి ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే, చేసుకుంటానని చెప్పి స్టేజి పైకి వచ్చింది. తర్వాత ఇమ్మూతో "నీకు పెళ్లి ఓకేనా?" అని శ్రీముఖి అడగడంతో ఆ ప్రోమో ఎండ్ ఐపోతోంది. ఐతే ప్రస్తుతం వర్ష లేకుండా వేరే అమ్మాయి ఇమ్ముకు ప్రపోజ్ చేసేసరికి ఈ వీడియో వైరల్ గా మారింది. ఒకవేళ వర్షకు ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.