English | Telugu

Jayam serial: గంగని ఇరికించేసిన ఇషిక.. రుద్ర ఏం చేయనున్నాడు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -151 లో.....మీ అమ్మని పెద్దమ్మ తిట్టినందుకు ఫీల్ అవుతున్నావా అని గంగని రుద్ర అడుగుతాడు. అదేం లేదు సర్ ఆని గంగ అంటుంది. గంగ ఒక్కోసారి ఒక్కోలా ఉంటావ్.. అసలు ఏం అర్థం కావు తెలుసా అని రుద్ర అంటాడు. మీరు కుడా అర్ధం కారు సర్.. అందుకే మిమ్మల్ని కలిసినప్పుడు క్రేజీ కాశ్మోరా అని పేరు పెట్టాను అనగానే రుద్ర నవ్వుకుంటాడు. గంగ వెళ్తుంటే చీరకి ఏదో చిక్కుబడుతుంది. రుద్ర పట్టుకొని ఆపాడని గంగ అనుకొని సిగ్గుపడుతుంది. తీరా చూస్తే దేనికో చిక్కుబడుతుంది.

మరుసటి రోజు రుద్ర లేచేసరికి తన బ్లాంకెట్ గంగ కప్పుకొని ఉంటుంది. బ్లాంకెట్ తీస్తుంటే మరొక బ్లాంకెట్ ఉంటుంది. అలా చాలా కప్పుకొని గంగ పడుకుంటుంది. తనని నిద్ర లేపి ప్రాక్టీస్ కి వెళ్లాలని చెప్తాడు రుద్ర. అత్తయ్య గారు గుడికి వెళ్లి కుంకుమార్చన చెయ్యాలని చెప్పారని గంగ అనగానే.. సరే ప్రాక్టీస్ చేసి అటు నుండి గుడికి వెళదామని రుద్ర అంటాడు. దాంతో బ్యాగ్ లో గంగ చీర పెట్టుకుంటుంది. ఇషిక ఆ చీర తీసి గ్లౌజు లు పెడుతుంది. ఆ తర్వాత గంగతో రుద్ర ప్రాక్టీస్ చేయిస్తాడు. మరొకవైపు స్వామిని ఇంటికి పిలిపిస్తాడు వీరు. స్వామి ఇంటికి రాగానే అందరు ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ఇంటి వారసుడి పెళ్లి పద్ధతి ప్రకారం జరగలేదని అతను చెప్తాడు. గంగ, రుద్రల కోసం ప్రమీల వెళ్తుంది. వాళ్ళు గదిలో లేరని చెప్తుంది. ప్రొద్దునే ప్రాక్టీస్ కి వెళ్లి ఉంటారు.. అయినా అత్తయ్య గుడికి వెళ్లామన్నారు కదా అది చెయ్యకుండా ప్రాక్టీస్ కి వెళ్లినట్టున్నారని ఇషిక అంటుంది.

మరొకవైపు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గంగ వెళ్తుంది. తీరా చూస్తే బ్యాగ్ లో చీర ఉండదు. ఇప్పుడు ఇలాగా వెళ్తే అత్తయ్యతో తిట్లు తప్పవని గంగ భయపడుతుంది. షాప్స్ ఓపెన్ ఉంటే చీర తీసుకోవాలని అనుకుంటారు. మరొకవైపు వదినకి అన్నయ్య ఫోన్ చేసి రమ్మంటానని వంశీ చెప్తాడు. ఫోన్ కలవడం లేదని మళ్ళీ అంటాడు. నీ ఫోన్ కలవలేదులే నేను చేస్తానని వీరు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.