English | Telugu

య‌ష్ ప్లాన్ మిస్‌ఫైర్.. మందేసి చిందేసిన వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సార‌మ‌వుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కొత్త‌గా మొద‌లైన ఈ సీరియల్ వారాలు గ‌డిచే కొద్దీ వీవ‌ర్షిప్ ని పెంచుకుంటూ పోతోంది. అమ్మా - నాన్నా - ఓ పాప క‌థ అనే కాన్సెప్ట్ తో ఈ ముగ్గురి మ‌ధ్య పెన‌వేసిన బంధం క‌థ‌గా ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగూతూ ఆక‌ట్టుకుంటోంది. ఇందులో నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక న‌టించారు.

వేద పేరెంట్స్ సులోచ‌న - వ‌ర‌ద‌రాజుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ. అయితే ఇందు కోసం మ‌ల్లెపూలు తీసుకొచ్చిన వ‌ర‌ద‌రాజులు ఈ విష‌యాన్ని య‌ష్ కు చెప్ప‌డం.. మీరు ఎక్క‌డ త‌గ్గొద్ద‌ని త‌న‌ని రెచ్చ‌గొడ్డంతో సులోచ‌న‌కు విషెస్ చెప్ప‌కుండా బెట్టుని ప్ర‌ద‌ర్శిస్తాడు వ‌ర‌ద‌రాజులు. త‌ను కూడా త‌క్కువ తిన్నానా ఏంటీ అనే రేంజ్ లో వ‌ర‌ద‌రాజులుతో ఆడుకుంటుంది. క‌ట్ చేస్తే ఇదంతా త‌న‌తో పాటు య‌ష్ వ‌ల్ల జ‌రిగింద‌ని గ‌మ‌నించిన వేద చివ‌రికి ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు క‌లిపేస్తుంది.

ఇదే స‌మయంలో సులోచ‌న - వ‌ర‌ద‌రాజుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ ని ప్లాన్ చేస్తారు. ఈ సంద‌ర్భంగా య‌ష్ త‌న గిఫ్ట్ గా మామ వ‌ర‌ద‌రాజులుకు వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తాడు. దాన్ని కూల్ డ్రింక్ లో క‌లిపి వ‌ర‌ద‌రాజులు కోసం రెడీ చేస్తారు. అయితే పొర‌పాటున ఆ డ్రింక్ ని వేద తాగేస్తుంది. దీంతో య‌ష్ ప్లాన్ మిస్‌ఫైర్ అవుతుంది. ఇక ర‌చ్చ మొద‌ల‌వుతుంది. య‌ష్ కి చుక్క‌లు చూపిస్తుంది. మ‌గాళ్లు వ‌ట్టి మాయ‌గాళ్లే .. అంటూ వీడుకూడ ఇంతే అని య‌ష్ పై వీరంగం వేస్తుంది. ఈ క్ర‌మంలో వేద ని చూసిన కొంత మంది గెస్ట్ లు అవ‌మాన‌క‌రంగా మాట్లాడ‌తారు. ఆ స‌మ‌యంలో య‌ష్ ఎలా రియాక్ట్ అయ్యాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.



Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.