Read more!

English | Telugu

రాజీవ్ కుట్రని రిషి అర్థం చేసుకోగలడా!

స్టార్ మా లో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్-670 లోకి అడుగుపెట్టింది. గురువారం రిషి, వసుధార, కాలేజీ మేడమ్ కలిసి మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తారు. "రిషి వసుధార మీరిద్దరు ప్రాజెక్ట్ ఇలాగే కలిసి చేస్తే అన్నింట్లో విజయం సాధిస్తారు" అంటూ మినిస్టర్ మెచ్చుకుంటాడు. 

మినిస్టర్ కి ప్రాజెక్ట్ వివరించి తిరిగి వస్తుండగా... కార్ లో  వసుధార, రిషి మాత్రమే ఉంటారు. ఎవరు లేరు కదా ఇప్పుడు నిజం చెప్దాం అని అనుకునేసరికి రాజీవ్ కార్ లో ఎదురుగా వస్తాడు. "రిషి సర్ నా భార్యని నాతో పంపించండి" అని రాజీవ్ అడుగుతాడు. "ఏంటి వసుధార నడిరోడ్డు మీద ఈ నాన్ సెన్స్ వెళ్ళు" అని రిషి చెప్తాడు. రాజీవ్ మాటలు నమ్మకండి సర్ అని వసుధార చెప్తుంది. "రిషి సర్ నా భార్య నాతో కాకుండా మీతో తిరుగుతుంది.. చూసే వాళ్ళు ఏం అనుకుంటారు" అని వసుధార చెయ్యి పట్టుకుంటాడు రాజీవ్. దాంతో వసుధార చెయ్యి విడిపించుకొని ఆటో ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రాజీవ్ వీళ్ళ మధ్యలో దూరం పెంచుతున్నాను అని సంతోషంగా ఫీల్ అయ్యి దేవయానికి ఫోన్ చేసి "రిషి జీవితంలో వసుధార లేకుండా చెయ్యడానికి అద్భుతమైన ప్లాన్ వేసాను" అంటూ చెప్తాడు.

మరోవైపు మహేంద్రతో తనని అందరూ మోసం చేసి వెళ్తున్నారని  రిషి చెప్పుకొని బాధపడుతుంటాడు. "నా జీవితంలో అన్నీ ఇలానే జరుగుతున్నాయి" అంటూ వసుధారని గుర్తు చేసుకుంటూ డ్రింక్ చెయ్యాలని ప్రయత్నిస్తాడు. కానీ అందుకు తన మనసు ఒప్పుకోక  పడేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు  ఆగాల్సిందే...!