English | Telugu

కృష్ణ అంటే మురారికి ఇష్టమో లేదో తెలుసుకోవాలి!

'కృష్ణ ముకుంద మురారి' సీరియల్స్టార్ మా లో 64వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. గురువారం నాటి ఎపిసోడ్ లో కుటుంబం మొత్తం భోజనం చేస్తుండగా... మురారి డల్ గా కన్పించడంతో "ఎందుకలా ఉన్నావ్ మురారి" అని భవాని అడుగుతుంది. దానికి రేవతి "తిన్నది అరగక అలా ఉంటున్నాడు" అని చెప్పడంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. "అదేంటి మురారిని ఒక్కమాట కూడా అనేదానివి కాదు.. నన్ను కూడా అననిచ్చేదానివి కాదు.. ఎందుకు రేవతి అలా అంటున్నావ్" అని‌ భవాని అడుగుతుంది. రేవతి మౌనంగా ఉండిపోతుంది.

ఎక్కడ అమాయకురాలైన కృష్ణ కాపురం చెడిపోతుందో అంటూ రేవతి దిగులు పడుతుంది. అసలు మురారికి కృష్ణ అంటే ఇష్టమో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.

మరో వైపు మురారి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ముకుంద. "నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా మురారి ఎందుకు రావట్లేదు. నేను వచ్చే ముందే అంత చెప్పి వచ్చాను కదా అనుకుంటూ తను, మురారి మాట్లాడుకున్న మాటలన్నీ గుర్తుచేసుకుంటూ ఉంటుంది. అంతలోనే ముకుంద తల్లి అక్కడికి వచ్చి... "ఏంటి అమ్మా.. నీకు సపోర్ట్ ఇస్తూ ఒక తల్లిగా మాట్లాడినా కానీ నువ్వు ఇన్ని రోజులు ఎవరు రావాలని ఎదురుచూస్తున్నావు. పిలవాల్సిన వాళ్ళు పిలిస్తే వెళ్తా అన్నావ్.. ఎవరు వాళ్ళు?" అని అడుగుతుంది. ముకుంద ఏం చెప్పకపోయేసరికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయాక "నా అంతట నేనే ఎలా వెళ్ళగలను. అటు వెళ్ళలేను. ఇక్కడ ఉండలేను" అని ముకుంద ఆలోచనలో పడుతుంది. మరోవైపు కృష్ణని చూసి రేవతి అడుగుతుంది. "కృష్ణ... ఎప్పుడు ఫోన్ గురించి కాకుండా మురారిని కూడా పట్టించుకో" అని రేవతి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.