English | Telugu
అక్కడ చేపలు పట్టావ్, ఇక్కడ మేకలు పట్టావ్.. ఇప్పుడెవరిని పట్టావ్?
Updated : Aug 25, 2022
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' మూవీతో ఓవర్ నైట్ క్రేజీ మీరో ఐపోయాడు తేజ్. తర్వాత 'కొండపొలం'లో చేసి పర్లేదనిపించుకున్నాడు. సైలెంట్ గా వచ్చి స్టార్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. ఇక ఇప్పుడు 'రంగ రంగ వైభవంగా' అని మూవీలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎంటర్టైన్ చేసాడు.
"ఉప్పెన మూవీలో చేపలు పట్టావ్, 'కొండపొలం' సినిమాలో మేకలు పట్టావ్, మరి ఈ సినిమాలో ఎవరిని 'పట్టావ్?" అంటూ ఆలీ అడిగిన ఫన్నీ క్వశ్చన్ కి "అమ్మాయిని పట్టాను" అంటూ అదే రేంజ్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు తేజ్. "నువ్ చేసిన రెండు సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయ్ కదా.. ఈ సినిమాలో కూడా అలాంటి సాంగ్ ఉంటేనే సినిమా చేస్తాను అన్నావట?" అని అడిగేసరికి తేజ్ నవ్వేసాడు ఆన్సర్ చెప్పకుండా.. "రొమాంటిక్ మూవీలో ఆల్రెడీ రొమాంటిక్ గా చేసింది కాబట్టి కేతిక శర్మతో ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సాంగ్ చేయించావ్" అని ఆలీనే ఆన్సర్ ఇచ్చేసి నవ్వేశారు.
"నాచురల్ గా కాటుక కళ్ళు అని అమ్మాయిలను అంటారు.. కానీ నీ కళ్ళు కాటుక పెట్టినట్లు ఉంటాయి" అని అనేసరికి "నన్ను చాలా మంది అడిగారు కూడా.. 'కాజల్ పెట్టుకుని వస్తావా?' అని." అన్నాడు వైష్ణవ్. అందుకే "నీ కళ్ళు చూసే రాసారేమో ఉప్పెన మూవీలో 'నీ కళ్ళు నీలి సముద్రం' అనే పాట" అని ఆలీ అడిగేసరికి "ఏమో అంకుల్.. రైటర్ ని అడగాలి" అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు.