English | Telugu

హిస్టరీ రిపీట్ అంటున్న బాలకృష్ణ ..అన్‌స్టాప‌బుల్ యాంథమ్ సీజన్ 2 రిలీజ్

నందమూరి బాలకృష్ణ నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎంతో మందిని అలరించారు..అలరిస్తూనే ఉన్నారు..ఇక ఇప్పుడు ఆహా వారి అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే షో తో హోస్ట్‌గా మారి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే’ సీజన్ 2 ద్వారా ఇంకోసారి ఫాన్స్ ని, ఆడియన్స్ ని తనదైన స్టయిల్లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోస్‌ను లాంచ్ చేసే ఆహా , ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2’ కోసం టైటిల్ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది.

"నేను దిగ‌నంత వ‌ర‌కే" అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. మాస్ ఆడియన్స్ మదిని దోచేలా ఉంది ఈ సాంగ్. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 ఎంత సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు సీజన్ 2 అక్టోబర్ లో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. అందుకు ముందుగా అన్‌స్టాప‌బుల్ యాంథమ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను రోల్ రైడా, మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ రూపొందించారు. బాల‌కృష్ణ‌ను స‌రికొత్త కోణంలో ఎలివేట్ చేయనుంది సీజన్ 2 ..దీంతో సీజ‌న్ 2పై భారీగా ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇండ‌స్ట్రీలోని టాప్ యాక్టర్స్ అంతా ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.