English | Telugu

ఏకాభిప్రాయాలే టికెట్ టు ఫినాలేనా?


బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత వింతగా ఈ సీజన్ సాగుతోంది. ఇప్పటివరకూ టాస్క్ లో గెలిచినవారిదే కెప్టెన్సీ. దాంతో గేమ్ లో బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడేమో ఈ టికెట్ టు ఫినాలే కోసం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోండి అని బిగ్ బాస్ ప్రతీ టాస్క్ లోని లెవెల్ లో చెప్తూ వస్తున్నాడు. దీంతో హౌస్ మేట్స్ హై ఇంటెన్స్ గా ఫీల్ అవుతున్నారు.

నిన్నటి ఎపిసోడ్‌లో ప్రతీ కంటెస్టెంట్ బిగ్ బాస్ కి ఎదురు తిరిగారు. ఎందుకంటే టాస్క్ లో కష్టపడి ఆడి ఆరుగురు గెలిస్తే వారిలో నుండి ఏకాభిప్రాయంతో ఇద్దరిని తొలగించాలి అంటే కంటెస్టెంట్స్ కే కాకుండా, అలా ఎలా అంటూ చూసే ప్రేక్షకులకు కూడా విసుగొచ్చింది.

గత రెండు రోజుల నుండి 'టికెట్ టూ ఫినాలే' టాస్క్ జరుగుతోంది కానీ ప్రతీ లెవెల్ లో ఒక్కో కంటెస్టెంట్ ని ఏకాభిప్రాయంతో తొలగించాలి అని చెబుతూ వస్తున్నాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ పెడితే వాళ్ళలో ఎవరు ఎంత ఆడతారో అని తెలిసిపోతుంది అలాంటిది ఏ టాస్క్ పెట్టకుండా ఏకాభిప్రాయం ఏంటి? అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ లాంటి మెరుగైన కంటెస్టెంట్ కి సరైన టాస్క్ లు ఇవ్వకుండా వేరొకరి మీద నిర్ణయాన్ని ఉంచడమేంటి ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.