English | Telugu

నోరు జారుతున్న కీర్తి భట్!

బిగ్ బాస్ హౌస్ లో నాలుగు రోజులుగా సాగుతున్న 'టికెట్ టు ఫినాలే' టాస్క్ చివరి దశకి కి చేరుకుంది. ఇందుకే ఒక్కో లెవెల్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఒక్కో రేస్ నుండి తొలగిస్తున్నాడు బిగ్ బాస్. కాగా నిన్న జరిగిన టాస్క్ లో రేస్ లో చివరన ఉన్నవాళ్ళకి కూడా అవకాశం ఇచ్చాడు. "టాస్క్ పేరు 'రోల్ బేబి రోల్'. ఇందులో ఎవరు అయితే బ్రిక్స్ తో హైట్ బిల్డిండ్ కడతారో, వాళ్ళు ఈ లెవెల్ లో మొదట్లో ఉంటారు. కాగా ఈ టాస్క్ కి ఇనయా, శ్రీసత్య సంచాలకులు గా ఉంటారు" అని బిగ్ బాస్ చెప్పాడు.

అయితే ఈ టాస్క్ లో రోల్ చేసుకుంటూ బ్రిక్స్ ని తీసుకెళ్ళి, హైట్ బిల్డింగ్ కట్టాలి అనే రూల్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కీర్తి, ఫైమా, రోహిత్, శ్రీహాన్ నలుగురు పాల్గొన్నారు. టాస్క్ ముగిసే సమయానికి అతి తక్కువ బ్రిక్స్ తో కీర్తి, ఫైమా ఉండగా, శ్రీహాన్ మొదటి స్థానం, రోహిత్ రెండవ స్థానంలో ఉన్నారు. అయితే ఇదే విషయం సంచాలకులుగా చేస్తున్న ఇనయా, శ్రీసత్యలు బిగ్ బాస్ కి చెప్పగా, కీర్తి కోపంగా "శ్రీసత్య సంచాలకురాలిగా ఉండి కూడా శ్రీహాన్ కి సపోర్ట్ చేసింది. గ్యాప్స్ ఉండకూడదు అని ముందు మీరు చెప్పారు" అని శ్రీసత్యని అడిగింది కీర్తి.

"మనమెందుకు కష్డపడాలి. ఇంత అన్ ఫెయిర్ గా ఆడితే ఎలా, కష్టపడి ఆడినందుకు ఇలా చేస్తారా, ఎందుకు ఇలా చేస్తారు. తుప్పాస్ సంచాలక్ " అని కీర్తి వచ్చేసింది. "ప్రతీసారీ ఫెవరిజం చూపిస్తున్నారు. కష్టపడేవాళ్ళకి ఏం సపోర్ట్ ఉండదు. థు.. ఇలాంటి జనాల మధ్య నేనున్నానా " అని కీర్తి ఒంటరిగా కూర్చొని బాధపడింది. నా స్ట్రెంత్ మీద నాకు నమ్మకం ఉంది" అంటూ చెప్పుకుంది. అయితే కీర్తి సంచాలకులు ఇచ్చిన నిర్ణయాన్ని వినకుండా కొన్ని మాటలు జారింది. "ఫుల్ నెగెటివ్ అవుతున్నాను బిగ్ బాస్.. ప్లీజ్ నన్ను ఒక్కసారి కన్ఫెషన్ రూంకి పిలవండి" అని కీర్తి రిక్వెస్ట్ చేసింది. ఆమె రిక్వెస్ట్ ని ఒప్పుకోలేదు బిగ్ బాస్.ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ "లెవల్స్ పూర్తి అయ్యేసరికి తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి టికెట్ ఫినాలే రేస్ లో నుండి తొలగిపోయింది" అని చెప్పాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.