English | Telugu

Telugu Tv Serials TRP: టీఆర్పీలో కార్తీక దీపం-2 నెంబర్ వన్.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు!

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి అత్యధిక టీఅర్పీలు వస్తుంటాయి. రూరల్ అండ్ అర్బన్ లో ఎక్కడ చూసిన ఈ సీరియల్స్ సత్తా చాటుతున్నాయి. మరి ఈ వారం దేనికి అత్యధిక టీఆర్పీ వచ్చిందో ఓసారి చూసేద్దాం.

రూరల్ , అర్బన్ లో 16.16 టీఆర్పీ తో కార్తీక దీపం-2 నెంబర్ వన్ స్థానంలో ఉంది. 15.15 టీఆర్పీతో ఇల్లు ఇల్లాలు పిల్లలు రెండో స్థానంలో ఉండగా, 13.84 టీఆర్పీ తో ఇంటింటి రామాయణం నాల్గవ స్థానంలో ఉంది. ఇక గుండె నిండా గుడిగంటలు 13. 16 తో అయిదో స్థానంలో ఉంది. ఇక మద్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్ లో బ్రహ్మముడి టాప్ లో ఉంది. మధ్యాహ్నం టైమ్ స్లాట్ సీరియల్స్ లో అత్యధికంగా 6.10 టీఆర్పీ తో బ్రహ్మముడి నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత 5.71 టీఆర్పీతో నిన్ను కోరి ఉంది. పలుకే బంగారమాయే సీరియల్ కి 5.38 టీఆర్పీ వస్తోంది.

ఇక ఈ వారం ఓవరాల్ గా సీరియల్స్ అన్నింటిలో కార్తీక దీపం-2 సీరియల్ సూపర్ సీరియల్ గా నిలిచింది. ఎందుకంటే కార్తీక దీపం-2 లో.. తాజా ఎపిసోడ్ లలో అన్నీ పాజిటివ్ అంశాలే జరిగాయి. దీప ప్రెగ్నెంట్ కావడం.. శివన్నారాయణ ఫ్యామిలీ దీపని అక్కున చేర్చుకోవడం.. కొత్త ఎండీగా శ్రీధర్ ఎన్నికవ్వడం.. ఇవన్నీ ఈ సీరియల్ కి ప్రధాన బలంగా నిలిచాయి. అయితే ఇవన్నీ చూసి చాలామంది ఈ సీరియల్ త్వరలో ముగుస్తుందని అంటున్నారు కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్ అనే విషయాన్ని జ్యోత్స్న తీసుకోలేకపోతుంది. మరోవైపు దాస్ జ్యోత్స్నని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దానితో పాటుగా శివన్నారాయణకి స్వామి రానున్న ఆపద గురించి చెప్పాడు. అంటే ఇంటివారసులు దీప అనే విషయం శివన్నారాయణ, సుమిత్ర, దశరథ్ లకి తెలుస్తుందేమో.. దాంతో దీపని చంపడానికి జ్యోత్స్న ఏం అయినా ప్లాన్ చేస్తుందేమో.‌. ఈ రకంగా సాగితే ఇంకో రెండు సంవత్సరాల దాకా కార్తీక దీపం-2 సీరియల్ కి డోకా లేదు. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు.. ముగ్గురు కోడల్లు.. ఎదురింట్లోనే శత్రువులు ఉండటం రామరాజు సీరియల్ కి హైప్ ఇస్తోంది. ఇక ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో కోడలు, కొడుకు ఇచ్చే ట్విస్ట్ లతో ఇంటి పెద్ద రామరాజుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది. అయితే ఎప్పుడైనా కంటెంట్ లేకుంటే రామరాజు, వేదవతిల మధ్య రొమాంటిక్ యాంగిల్ ని కూడా చూపిస్తున్నాడు దర్శకుడు. అందుకే ఈ సీరియల్ కి క్రేజ్ పెరుగుతుంది. స్టార్ మా సీరియల్స్ లో మీ ఫెవరెట్ సీరియల్ ఏంటో కామెంట్ చేయండి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.