English | Telugu

శ్రీ‌ముఖి‌ అక్క‌డా రుబ్బురోలే.. ఇక్క‌డా రుబ్బురోలే!

బుల్లితెర గ్లామ‌ర్ క్వీన్ శ్రీ‌ముఖి. యాంక‌ర్‌గా ఈ బొద్దుగుమ్మ‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ ప్రోగ్రామ్ చేసినా.. ఫొటో షూట్‌ల‌తో అద‌ర‌గొట్టినా శ్రీ‌ముఖి త‌న‌కు తానే సాటి. బుల్లి తెర రాముల‌మ్మ‌గా పాపులారిటీని ద‌క్కించుకున్న శ్రీ‌ముఖి ఇటీవ‌ల గోవాలో వాట‌ర్ డాల్‌గా మారి, చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. త‌డిపొడి డ్రెస్సుల్లో అందాలు ఆర‌బోస్తూ పోజులిచ్చిన ఫొటోలు నెట్టింట ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో హీటెక్కిస్తున్నాయి.

ఇదిలా వుంటే "శ్రీ‌ముఖి అక్క‌డా రుబ్బురోలే..ఇక్క‌డా రుబ్బురోలే" అంటూ రోహిణి చేసిన కామెంట్స్ ఇప్ప‌డు వైర‌ల్ గా మారాయి. `బిగ్‌బాస్ ఉత్స‌వం` పేరుతో `స్టార్ మా` బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల‌తో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఇటీవ‌లే ప్రారంభించింది. ముందుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్‌లు పాల్గొన‌గా చిత్రీక‌రించిన తొలి ఎసిసోడ్ ని టెలీకాస్ట్ చేశారు. తాజాగా సీజ‌న్‌3కి సంబంధించిన కంటెస్టెంట్‌ల‌తో `బిగ్‌బాస్ ఉత్స‌వం 2`ని టెలికాస్ట్ చేయ‌బోతున్నారు.

దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవ‌ల విడుద‌లైంది. ఇందులో రోహిణి యాంక‌ర్ శ్రీ‌ముఖిపై వేసిన పంచ్‌లు న‌వ్వులు పూయిస్తున్నాయి. రీయూనియ‌న్ పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌ముఖిని రోహిణి ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. రోహిణిని ఉద్దేశిస్తూ "బిగ్‌బాస్ ఇంట్లో చికెన్ రోలా వుండేదానివి..ఇప్పుడేంటీ రుబ్బురోల్‌లా త‌యార‌య్యావ్?"అని శ్రీ‌ముఖి పంచేసింది. ఈ పంచ్‌కి రోహిణి "నువ్వు మాత్రం అస్స‌లు మార‌లే.అక్క‌డా రుబ్బురోలే ఇక్క‌డా రుబ్బురోలే!"అని రివ‌ర్స్ పంచ్ వేసింది. ఈ పంచ్ వీర‌లెవెల్లో పేలి ఎపిసోడ్‌కే ఫైలైట్‌గా నిలిచింది. ఈ ఎపిసోడ్ వ‌చ్చే ఆదివారం టెలీకాస్ట్ కానుంది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.