English | Telugu

తనని మర్చిపోలేక సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోలేదా ?

సుమంత్ సత్యం మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. చేసినవి కొన్ని సినిమాలే ఐనా ఒక మోస్తరు పేరు సంపాదించుకున్నాడు. గోదావరి మూవీలో సుమంత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత గోల్కొండ హై స్కూల్ మూవీ చేసి ఆ పేరును డబుల్ చేసుకున్నాడు. ఐతే హిట్ మూవీస్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి సుమంత్ హిస్టరీలో. ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ తన పెళ్ళికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పాడు. మూవీ ఫీల్డ్ లో ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన విడిపోరని గారెంటీ లేదు. చాలా మంది సినిమా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇలా కలుసుకున్నారు అలా విడిపోయారు. పెళ్లి అనేది కొంతమందికి అవసరం కానీ అందరికీ కాదు అని అన్నారు. అలాగే తనని వదిలేసి వెళ్ళిపోయినా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా అనే మాట అబద్దం.

నేను చాలా హ్యాపీ గా ఉన్నా. నా లైఫ్ లో మళ్ళీ తనని కలవాలని కూడా ఎప్పుడూ అనిపించలేదు అని చెప్పారు. నేను మంచి సినిమాలు చేసాను, బాగా డబ్బు సంపాదించాను, మంచి వాటిల్లో ఇన్వెస్ట్ చేసాను కాబట్టి డబ్బు సంపాదన కోసం సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదని క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లో నా క్యారెక్టర్స్ వేరు నేను వేరు. భార్యాభర్తలు ఎవరైనా సరే తన సలహాలు అస్సలు తీసుకోవద్దని చెప్పారు. భార్యా బాధితుల విషయం గురించి తనకు పెద్దగా తెలీదన్నారు. ఎందుకంటే లైఫ్ లో అన్ని కష్టాలు కానీ, అంత గుడ్ రేలషన్ షిప్ అనేది లేదు అని చెప్పారు సుమంత్.

గడిచిన కాలం మళ్ళీ ఒక అవకాశం ఇస్తే అనే థాట్ మనసులో లేదు. ప్రొఫెషన్ పరంగా ఫెయిల్యూర్ ఐన మూవీస్ కూడా ఎన్నో నేర్పిస్తాయి. లైఫ్ లో హ్యాపీగా లేనివాళ్లే పాత విషయాల గురించి ఆలోచిస్తారు. కానీ తాను తన ఫామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. సినిమాలు ఫ్లాప్ ఐనప్పుడు నెగటివ్ థాట్స్ వస్తాయి కానీ ఫామిలీ సపోర్ట్ గా ఉంది కాబట్టి తనకు పెద్దగా సమస్య లేదన్నారు. ఫెయిల్యూర్స్ వస్తాయి అలాగే టైం వస్తే హిట్స్ కూడా వస్తాయి. కొంచెం ఓపిక పట్టాలి అంతే అంటూ తన లైఫ్ విషయాలు ఎన్నో షేర్ చేసుకున్నారు సుమంత్.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.