English | Telugu

సౌందర్య ప్రయత్నం ఫలిస్తుందా..!

కార్తీక్ దేవుడి గదిలో పూజ చేసి దీప గురించి మొక్కుకుంటాడు. దీప నిద్ర లేవడంతోనే నీరసంగా ఉంటుంది. "నాకేంటి ఈ రోజు ఇలా ఉంది" అని బాధపడుతుంది. ఇంతలో దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. దీపకి హారతి ఇస్తాడు. "డాక్టర్ బాబు.. మీరు పూజ చేసారా?" అని దీప అంటుంది. దానికి కార్తీక్ " నీకోసమే చేశాను" అని అంటాడు. మరోవైపు చారుశీలను కలవడానికి సౌందర్య హాస్పిటల్ కి వస్తుంది. "శౌర్య కోసం రాసిన మందుల చీటి పట్టుకొని వచ్చి, ఇది ఎవరు రాసారు" అని చారుశీలని అడుగుతుంది సౌందర్య. "కార్తిక్ రాశాడని డౌట్ వచ్చినట్టుంది ఆంటికి" అని మనసులో అనుకుంటుంది చారుశీల. "ఇది నా కొడుకు హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది" అని సౌందర్య అంటుంది. దానికి చారుశీల కంగారుపడి "లేదు ఆంటి.. నేనే రాశాను" అని చెప్తుంది.

ఆ తర్వాత హాస్పిటల్ నుండి సౌందర్య ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న ఆనందరావుని కలుస్తుంది. అతనితో మాట్లాడుతూ "కార్తీక్, దీప కన్పించాలని దేవుడిని మొక్కుకుందాం" అని చెప్తుంది. ఆ తర్వాత కార్తిక్, దీపలని వెతకాడానికి వెళ్తుంది సౌందర్య. అలా బయటకు వెళ్లే టైంకి అనుమానం వచ్చి, ఇంద్రున్ని పిలుస్తుంది. "ఇంద్రుడు.. నా కొడుకు, కోడలు ఎక్కడున్నారో, నీకు తెలుసు కదా? నీ భార్య మీద ఒట్టేసి చెప్పు" అని నిలదీస్తుంది సౌందర్య. దానికి ఇంద్రుడు తన భార్య మీద ఒట్టేసి "నిజంగానే నాకేం తెలియదు. ఎప్పుడు వాళ్ళని చూసింది లేదు" అని చెప్తాడు. అది విని నమ్మేస్తుంది. ఆ తర్వాత సౌందర్య బయటకు వచ్చేస్తుంది. మరో వైపు కార్తీక్ నిద్ర నుండి లేచి దీప దగ్గరికి వస్తాడు. "నువ్వు కిచెన్ లో ఏం చేస్తున్నావ్?" అని దీపని కోపగించుకుంటాడు. దానికి దీప మాట్లాడుతూ "నా జబ్బు కంటే, మీరు చేసే చేష్టలు చూస్తుంటేనే భయమేస్తుంది. ప్రతిసారి మీరు నాకు జబ్బుని గుర్తు చేస్తున్నారు" అని అంటుంది.

ఆ తర్వాత సౌందర్య వెతుక్కుంటూ.. దీప, కార్తీక్ లు ఉన్న ఇంటికే వస్తుంది. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఏం జరుగుతుందో? తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.