English | Telugu

అబ్బాయిల జీవితాలతో ఆడుకోవడం అలవాటు!

'మిస్టర్ అండ్ మిస్సెస్'రియాలిటీ షో ప్రతీ వారం మంచి ఎంటర్టైన్మెంట్‌ని అందిస్తూ బుల్లితెర మీద దూసుకుపోతోంది. ఇందులో పార్టిసిపేట్ చేసే కపుల్స్‌కి మంచి మంచి సెగ్మెంట్స్‌తో పోటీలు పెడుతూ ఎంటర్టైన్ చేస్తోంది హోస్ట్ శ్రీముఖి. లాస్ట్ వీక్ ఎపిసోడ్ కూడా అలాగే నవ్వు తెప్పించింది. ఇందులో పార్టిసిపేట్ చేసే పెయిర్స్‌తో లవ్ గేమ్స్ ఆడించింది.

ఇక ఈ ఎపిసోడ్‌లో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ రితేష్ వేసుకున్న డ్రెస్ మీద ఫన్నీ కామెంట్స్ చేసింది శ్రీముఖి. రాకేష్‌ని చూసి "ఏమిటి మహేష్ బాబు ఇక్కడా.." అని మోసేసింది. రాకింగ్ రాకేష్ కూడా మహేష్ బాబు డైలాగ్ ఒకటి చెప్పేసాడు. అతను మెడలో వేసుకున్న స్కార్ఫ్ చూసి "ఏమిటి చలి పెడుతోందా మీకు" అని దాన్ని సరిచేసింది.

"వాళ్ళ స్టైల్స్ ముందు మా ఆయన స్టైల్ చూడండి" అని శ్రీవాణి తన భర్త విక్రమ్ ని చూపించింది. ఆ తర్వాత జడ్జెస్ స్నేహ, శివబాలాజీని పిలిచింది. థీమ్ లవ్ గేమ్ కాబట్టి "మీరు కూడా ఒక ఆట బాగా ఆడతారని విన్నాను" అని శివబాలాజీని అడిగేసరికి "ఏ ఆట" అని సీరియస్ ఫేస్‌తో రివర్స్‌లోఅడిగాడు.. "ఈవెనింగ్ టైమ్స్, వీకెండ్స్ లో" అని శ్రీముఖి చెప్పింది. "అదా స్పిరిట్ గేమ్" అని ఆన్సర్ ఇచ్చాడు శివ బాలాజీ. ఆ కౌంటర్ కి అందరూ నవ్వేశారు.

"అదేనండి వాలీబాల్" అని శ్రీముఖి మళ్ళీ చెప్పేసరికి, "ఓ వాలీబాలా.. ఆ గేమ్ నేను బాగా ఆడతాను" అని చెప్పి "ఇంతకు మీరేం ఆడతారండి" అని శ్రీముఖిని రివర్స్‌లో అడిగేసరికి ఆమె తెగ సిగ్గుపడిపోయింది. "నేనా.. అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటాను" అని ఆన్సర్ చెప్పి అందరినీ నవ్వించింది.