English | Telugu
అప్పుడే నాయనమ్మ...ఇంకా పెళ్లేకాలేదు
Updated : Dec 8, 2023
ఈమధ్య హోస్ట్స్ మీద కమెడియన్స్, కంటెస్టెంట్స్ వంటివాళ్ళు జోక్స్ వేయడం సర్వసాధారణం ఐపోయింది. ఇక ఇప్పుడు కూడా అలాగే జరిగింది. జబర్దస్త్ కామెడీ షో లేటెస్ట్ ప్రోమోలో అది తెలుస్తుంది. నూకరాజు ఈ వారం స్కిట్ లో "జవాన్" మూవీలోని హీరో షారుఖ్ ఖాన్ ని ఇమిటేట్ చేసాడు. "నా మీనమ్మ ఇక్కడే ఎక్కడో తప్పిపోయింది" అంటూ షారుఖ్ ఖాన్ వాయిస్ తో నూకరాజు డైలాగ్ చెప్పేసరికి "నేనే నీ మీనమ్మ" అంటూ హోస్ట్ సిరి హన్మంత్ డైలాగ్ చెప్పింది.
"నేను నమ్మనమ్మా...నువ్వు నాయనమ్మ" అంటూ అంతటి అందాల సిరిని పట్టుకుని నాయనమ్మ అనేసరికి షాక్ అయ్యింది సిరి. ఈ డైలాగ్ కి కృష్ణ భగవాన్, ఇంద్రజ ఇద్దరూ పగలబడి నవ్వేశారు. సిరి హన్మంత్ ఈ "జవాన్" మూవీ షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక చిన్న రోల్ లో నటించింది. ఒక పోలీస్ గెటప్ లో కనిపించింది సిరి. ఇక నూకరాజు ఈ మధ్య వెరైటీ స్కిట్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. దీనిపై నెటిజన్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. "నూకరాజు మంచి కాన్సెప్ట్స్ లో మంచి నటనతో అలరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇదే బెస్ట్ స్కిట్" అంటూ కామెంట్స్ చేశారు. జబర్దస్త్ లో ఈమధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో ఫుల్ ఫేమస్ ఐన శ్రీదేవి అనే ఆమె ఈ మధ్య కెవ్వు కార్తీక్- పటాస్ ప్రవీణ్ టీమ్ లో చేస్తోంది...ఇక ఈ స్కిట్ లో శ్రీదేవి పెద్ద డైలాగ్ వేసేసింది "రెండో స్కిట్ కె వాడి కాలు, వీడి కాలు పట్టుకోవాల్సి వస్తోంది" అనేసరికి ఇంద్రజ నవ్వేసింది.