English | Telugu

Brahmamudi:రాహుల్ చేసిన ప్లాన్ అదే.. రౌడీల నుండి శృతి తప్పించుకుంటుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -899 లో.. కావ్యని తీసుకొని రాజ్ హోటల్ కి వస్తాడు. నీకు నచ్చింది తినమని చెప్తాడు. ఎప్పుడు నాతో గొడవపడుతూ ఉంటావ్.. అలా కాకుండా సిగ్గుపడుతూ ఉండమని రాజ్ చెప్తాడు. రాజ్, కావ్య మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరిని చూసి పక్కనున్న వాళ్ళు మీరు లవర్స్ ఆ అని అడుగుతారు. మీ జంట చాలా బాగుందని అంటారు దాంతో రాజ్ మురిసిపోతాడు. వాళ్ళని చోటు, మోటు అనే ఇద్దరు రౌడీ లు గమనిస్తారు.

వాళ్ళు పెన్ డ్రైవ్ రూమ్ లో పెట్టి ఉంటారని అనుకొని వెళ్లి రూమ్ లో వెతుకుదామని అనుకుంటారు. కావ్య, రాజ్ ల రూమ్ లోకి వాళ్ళు వెళ్లి వాళ్ళు వెతుకుతారు. అప్పుడే హోటల్ సర్వర్ వచ్చి.. బాత్రూం క్లీన్ చెయ్యడానికి వచ్చింది మీరేనా అని వాళ్ళ చేత బాత్రూం క్లీన్ చేపిస్తాడు. ఇక మోటు చోటు ఇద్దరు గదిలో వెతికిన పెన్ డ్రైవ్ దొరకదు.. మరొకవైపు స్వప్నకి రాహుల్ ఒక నెక్లెస్ తీసుకొని వచ్చి ఇస్తాడు. స్వప్న నువ్వు ఈ డిజైన్స్ ని సెలెక్ట్ చేయమని చెప్తాడు. దాంతో స్వప్న కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేస్తుంది. నువ్వు ఎప్పటికి ఇలాగే ఉంటావ్ కదా అని రాహుల్ తో స్వప్న ప్రేమగా మాట్లాడుతుంది. ఆ తర్వాత చోటు, మోటు ఇద్దరు మళ్ళీ రాజ్, కావ్య దగ్గరికి వెళ్తారు. చోటు, మోటు రావడం రాజ్, కావ్య చూస్తారు.

చోటు, మోటు బేరర్ గా రాజ్ దగ్గర కి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని తన ఫోన్ ని టేబుల్ కింద పెడతాడు. అది రాజ్ గమనించి కావ్యకి చెప్తాడు. ఇక ఇద్దరు కావాలనే పెన్ డ్రైవ్ శృతికి ఇచ్చాము కదా అని అనుకుంటారు. రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్లతో పాటు చోటు, మోటు ఇద్దరు వెళ్ళిపోతారు. సంగీత కచేరి చేసేవాళ్ళ దగ్గరికి వెళ్లి శృతి ఎక్కడ అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.