English | Telugu
పొట్టి నిక్కరులో శ్రీముఖి..మరీ ఇంత లావుగా ఉందేంటి అన్న అర్జున్!
Updated : Dec 27, 2022
బీబీ జోడి షో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కంటెస్టెంట్స్ తమ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో బాగా ఆకట్టుకున్నారు.
ఐతే యాంకర్ శ్రీముఖి తన గ్లామర్ తో అందాల విందు చేసింది. సిల్వర్ కలర్ పొట్టి నిక్కరులో స్టేజి మీద మెరిసిపోయింది. డాన్స్ పెర్ఫార్మెన్సెస్ లో భాగంగా అర్జున్ కళ్యాణ్ - వాసంతి ఇద్దరూ బాగా డాన్స్ చేశారు. వాళ్ళ ఇద్దరి డాన్స్ అయ్యాక శ్రీముఖి అర్జున్ తో కలిసి ఒక గేమ్ ఆడింది. అతని కళ్ళకు గంతలు కట్టి నలుగురిలో ఉన్న వాసంతి చేయి ఏదో గుర్తుపట్టాలని చెప్పింది. ముందుగా శ్రీముఖి తన చేతిని అర్జున్ కి ఇచ్చింది.
ఇక అర్జున్ ఆమె చేయిని పట్టుకుని "ఏమిటి ఈ చేయి మరీ ఇంత లావుగా ఉంది...ఎవరిదో అబ్బాయి చేయి అది" అని ఊహించని కామెంట్ అనేసరికి శ్రీముఖి షాకైపోయింది. స్టేజి మీద ఉన్నవాళ్ళంతా పడీ పడీ నవ్వేశారు.