English | Telugu

ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు మ‌ళ్లీ షాక్‌.. త‌గ్గేదేలే అంటున్న దీప్తి!

దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బ్రేక‌ప్ వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. బిగ్‌ బాస్ సీజ‌న్ 5 వీరి మ‌ద్య అగాధాన్ని ఏర్ప‌రిచింది. సిరితో ష‌న్ను అతి క్లోజ్‌గా వుండ‌టం దీప్తితో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు న‌చ్చ‌లేద‌ని, ఈ అతిని వ‌దిలించుకోమ‌ని ఆమెకు చెప్ప‌డం వ‌ల్లే ష‌న్నుకు దీప్తి బ్రేక‌ప్ చెప్పేసింద‌ని సోష‌ల్‌ మీడియాలో కామెంట్ లు వినిపిస్తున్నాయి.

Also Read: బ్రేకప్ తర్వాత ఊహించని సర్ప్రైజ్.. దీప్తితో కలిసున్న ఫోటో షేర్ చేసిన షణ్ముఖ్!

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో దీప్తి, ష‌న్ను ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా విడిపోయారు. అయితే ఆమెకు ద‌గ్గ‌ర కావాల‌ని ష‌న్ను మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. దీప్తి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ష‌న్ను త‌న‌తో క‌లిసి పంచుకున్న ఓ పాత ఫొటోని షేర్ చేసి దీప్తిని స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని ప్లాన్ చేశాడు. కానీ దీప్తి మాత్రం అత‌న్ని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. అత‌ని పోస్ట్ పై ఆమె ఎలాంటి కామెంట్ చేయ‌లేదు స‌రికదా త‌గ్గేదే లే అన్న‌ట్టుగా ష‌న్నుని బ్లాక్ చేసింది కూడా.

ప్ర‌స్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కేరీర్ కోసం ఆలోచిస్తున్నాన‌ని, షూటింగ్ చేసి చాలా రోజుల‌వుతోంద‌ని, త్వ‌ర‌లోనే కెమెరా ముందుకు వ‌స్తాన‌ని రీసెంట్ గా పోస్ట్ చేసిన ష‌ణ్ముఖ్ ఉన్న‌ట్టుండి దీప్తిని ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటే, కొంత మంది మాత్రం ష‌న్ను చేస్తున్న పనులు న‌చ్చ‌క సెటైర్లు వేస్తున్నారు. 'చేసిందంతా చేసి చేతుల కాలాక ఇప్పుడు ఆకులు ప‌ట్టుకుంటున్నావేంటి?' అని కౌంట‌ర్లు ఇస్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.