English | Telugu

బ్రేకప్ తర్వాత ఊహించని సర్ప్రైజ్.. దీప్తితో కలిసున్న ఫోటో షేర్ చేసిన షణ్ముఖ్!

యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్ ఐదేళ్ల తమ ప్రేమ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 5 లో షణ్ముఖ్ సిరితో మెలిగిన తీరే వీరి బ్రేకప్ కి కారణమని వార్తలొచ్చాయి. బ్రేకప్ కి కారణమేంటో చెప్పలేదు కానీ తాము విడిపోతున్నట్లు దీప్తి, షణ్ముఖ్ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరిద్దరి మధ్య ఇక మాటలు ఉండవని భావించారంతా. కానీ తాజాగా దీప్తితో ఉన్న ఫోటోని షేర్ చేసి సర్ ప్రైజ్ చేశాడు షణ్ముఖ్.

నేడు(జనవరి 10) దీప్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే డీ(దీప్తి)’అంటూ బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆమెతో కలిసున్న పాత ఫొటోను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేశాడు షణ్ముఖ్. ఈ ఫొటోకి వీరిద్దరూ కలిసి నటించిన మలుపు సిరీస్‌ సాంగ్‌ ను జత చేయడం విశేషం. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ షణ్ముఖ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షణ్ముఖ్ తాజాగా ఇన్ స్టా స్టోరీ చూస్తే మళ్ళీ దీప్తికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడా అన్న సందేహం కలుగుతోంది. అయితే షణ్ముఖ్ పోస్టుపై దీప్తి ఇంతవరకు స్పందించలేదు. ఆమె బ్రేకప్ ప్రకటించడానికి ముందే షణ్ముఖ్ ని ఇన్ స్టాలో బ్లాక్ చేసింది. మరి దీప్తి తన మాజీ ప్రియుడితో మళ్ళీ మాట కలుపుతుందో లేదో చూడాలి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...