English | Telugu

రిషి ప్రాణాలా.. కాలేజీయా...గుండెపగిలేలా ఏడ్చిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-757 లో రిషి గురించి శైలేంద్ర, దేవయాని మాట్లాడుకునేటప్పుడు జగతి వింటుంది. వారి గురించి రిషికి చెప్తానని బయల్దేరగా.. ఏంటి ఇప్పుడు నీకు భయపడాలా?.. రిషి చివరి క్షణాలు చూడటానికి వెళ్తున్నావా పిన్ని అని శైలేంద్ర అనగానే.. ఒక్కసారిగా ఆగిపోతుంది జగతి.

ఆ తర్వాత జగతితో ఇద్దరు మాట్లాడుతుంటారు. మేం చెప్పేదే రిషి వింటాడు.. నువ్వు చెప్పింది వినడు.. విన్నా పట్టించుకోడు.. ఒకవేళ పట్టించుకున్నా తన ప్రాణాలకే ప్రమాదం అని దేవయాని అంటుంది. మీ నిజస్వరూపాన్ని, మీ కుట్రలని నేను రిషికి చెప్తాను.. రిషి నా మాట వింటాడు.. తనతో చెప్పి మీ అంతు చూసేలా చేస్తానని జగతి అంటుంది. దాంతో శైలేంద్ర జరుగబోయేది చెప్తాడు. ఒకవేళ నువ్వు రిషికి చెప్తే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. DBST కాలేజ్ ఎండీ పోస్ట్ నాకు కావాలి. ఆ పదవి నుండి రిషిని తప్పించి.. ఎక్కడికైనా పంపించు లేదా రిషి, వసుధారలకి పెళ్ళి చేసి దూరంగా పంపించు.. అప్పుడు మిమ్మల్ని వదిలేస్తానని శైలేంద్ర అంటాడు. దానికి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది జగతి. రిషి ప్రాణాలా? కాలేజా? తేల్చుకోండి.. వాడిని దూరంగా తీసుకెళ్ళి వాడి ప్రాణాలను కాపాడుకో.. ఒంటరిగా కూర్చొని జాగ్రత్తగా ఆలోచించుకో.‌. కన్నీళ్ళు వస్తుంటాయి.. గుండెపగిలినట్టు అనిపిస్తుంది. ‌ అయినా సరే బాధలోనే సరైన నిర్ణయం తీసుకోవచ్చని శైలేంద్ర అంటాడు.

ఆ తర్వాత జగతి వెళ్తుంది. కాసేపటికి జగతి గదిలోకి మహేంద్ర వస్తాడు. అటుఇటు చూస్తాడు.. ఎక్కడ జగతి కనిపించకపోవడంతో వసుధార దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన గదిలో ఉండదు. ఆ తర్వాత జగతి కోసం మహేంద్ర, వసుధార కలిసి రిషి గదికి వస్తారు. రిషి గదిలో కూడా లేకపోవడంతో అందరూ టెన్షన్ పడతారు. ఇక టెర్రస్ మీద మీరిద్దరు చూడండి.. నేను బయట చూస్తానని మహేంద్ర, వడుధారలతో రిషి చెప్తాడు. టెర్రస్ పైకి వెళ్ళేసరికి.. జగతి ఏడుస్తుంటుంది. వసుధార, మహేంద్రలు తనని చూసి.. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావని అడిగినా తనేం చెప్పదు.. ఏడుస్తూనే ఉంటుంది. కాసేపటికి రిషి టెర్రస్ మీదకి వస్తాడు. రిషిని చూసిన జగతి ఏడ్చుకుంటూ రిషిని చూసి.. తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.