English | Telugu

నెక్స్ట్ వీక్ సర్కార్ సీజన్ 3 లో ‘మెన్ టూ’ టీం

సర్కార్ సీజన్ 3 ఫస్ట్ వీక్ ఎపిసోడ్ హిట్ కొట్టింది. బిడ్డింగ్ నేప‌థ్యంలో సాగే ఈ గేమ్ షోలో అన్ని రకాల సబ్జెక్ట్స్ కి సంబందించిన ప్రశ్నలను అడుగుతాడు ప్రదీప్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి మెన్ టూ మూవీ టీమ్ వచ్చింది. బ్రహ్మాజీ, నరేష్ అగస్త్య, సుదర్శన్ , రాకేందు మౌళి వచ్చారు. ఏ షోకైనా ముందుగా హోస్ట్ వచ్చి సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేస్తారు. కానీ ఈ రాబోయే ఎపిసోడ్ లో మాత్రం సెలబ్రిటీస్ ముందుగా వచ్చేసారు "వెల్కమ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఆఫ్ ఇండియా" అంటూ బ్రహ్మాజీ హోస్ట్ ప్రదీప్ ని ఇన్వైట్ చేసాడు. "అదేంటి సర్ ఆర్డర్ మారిపోయింది.

ముందు నేను వచ్చి గెస్ట్స్ ని ఇన్వైట్ చేస్తాను కానీ ముందు మీరు వచ్చి నన్ను పిలిచారు" అని అడిగాడు " అంటే ఈ సినిమా మెన్ టూ.అందుకే ఇందులో మోస్ట్ ముదిరిపోయినా బాచిలర్ ఎవరంటే"అనేసరికి అక్కడితో టాపిక్ కట్ చేసాడు ప్రదీప్.."మెమ్మేము బాచిలర్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ మీకు పెళ్లయ్యింది కదా మరి పెళ్లి వద్దు అంటున్నారు" అని బ్రహ్మాజీని అడిగేసరికి కాసేపు ఏడ్చినట్టు నటించాడు. ఇక తర్వాత క్వశ్చన్స్ కి అమౌంట్ బిడ్ చేశారు. ఈ షో ఆహ ఓటిటి వేదిక మీద మే 12 న ప్రసారం కాబోతోంది. ప్రతీ వారం ఈ షో రెట్టింపు ఉత్సాహంతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.