English | Telugu

పుష్ప రోల్ ని కమల్ తప్ప ఎవరూ చేయలేరు...ప్రభాస్ నా క్రష్ అన్న రాధ!

బీబీ జోడిలో జడ్జెస్ ఎవరో మనకు తెలుసు..రాధా, సదా. మరి సదా సరికొత్తగా ఒక వీడియో చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అదే "చిట్ చాట్ విత్ రాధా". ఇందులో సదా రాధను కొన్ని ప్రశ్నలు వేసింది.. రాధా కూడా వాటికి ఇంటరెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. "మీకు ఏ హీరో డాన్స్ అంటే ఇష్టం" అని అడిగేసరికి " ఆన్సర్ చెప్పడం కష్టం..జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్" అని చెప్పింది. "ఒకవేళ మూవీ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే టీచర్ ని అయ్యేదాన్ని..ఆ కోరిక ఇప్పుడు బీబీ జోడిలో జడ్జి రూపంలో తీరింది" అని చెప్పింది. "మీ టైములో పుష్ప మూవీ తీసి ఉంటే పర్ఫెక్ట్ హీరో ఎవరు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు" అనేసరికి " బన్నీ తప్ప ఆ క్యారెక్టర్ ఎవరూ చేయలేరు. 80 S లో అలా డిగ్లామర్ రోల్ లో ఎవరూ చేసేవారు కాదు. ఒకవేళ అలా చెయ్యాలి అంటే మాత్రం కమల్ హాసన్..ఆయన తప్ప ఆ ప్రయోగం మరొకరు చేయలేరు. మా టైంలో కమల్ డ్రీం బాయ్, హ్యాండ్సమ్ గై, బ్యూటిఫుల్ మ్యాన్ . స్టీరియో టైపు కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తారు." "లాస్ వేగాస్ నాకు ఇష్టమైన హాలిడే స్పాట్. ఎందుకు అంటే అక్కడికి వచ్చే వాళ్లంతా ఒకే మూడ్ తో ఎంజాయ్, ఎంజాయ్ అంటూ వస్తారు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని సిగ్గు పడరు.

" ఈ జనరేషన్ హీరోస్ లో ప్రభాస్ నా క్రష్..ఒకవేళ నాకు ఫేమ్ రాకపోయి ఉంటే పిల్లల్ని కానీ గుడ్ హౌస్ వైఫ్ గా సెటిల్ ఐపోయి బిజినెస్ పెట్టుకుని నడుపుకునేదాన్ని. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. నాకు ఇంత పేరు రావడానికి కారణం భారతిరాజాగారు నా గాడ్ ఫాదర్ , మా అమ్మ, మా సిస్టర్ నాకు ఇన్స్పిరేషన్. టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒక షెడ్యూల్ చేసాను..తర్వాత బ్రేక్ వచ్చింది అప్పుడు నేను స్కూల్ కి వెళ్లాల్సి ఉంది. ఐతే నా స్కూల్ లో నన్ను ఎవరైనా గుర్తుపడతారా అని అనుకునే టైంలో మలయాళం పేపర్ లో హీరోతో ఒక రొమాంటిక్ పోజ్ వచ్చింది. అది చూసినప్పుడు నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. అప్పటికి సెలబ్రిటీ స్టేటస్ అంటే తెలీదు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. నా పేరు మార్చింది భారతి రాజా గారు. నా అసలు పేరు ఉదయ చంద్రిక..ఆ పేరు కూడా నాకు చాలా ఇష్టం. నేను సూపర్ వుమన్, గుడ్ మదర్, గుడ్ హౌస్ వైఫ్..ఇవే నా సూపర్ పవర్స్. ఇండస్ట్రీలో సరితా తప్ప నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఫోర్త్ క్లాస్ నుంచి ఇప్పటివరకు జయ, షీలా అనే ఫ్రెండ్స్ ఉన్నారు. పెళ్లయ్యాక బొంబాయిలో రీతూ అనే ఫ్రెండ్ ఉంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాకు రామ్ చరణ్ క్యారెక్టర్ అంటే ఇష్టం. ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. తెలుగులో ఛాన్స్ వస్తే పాజిటివ్ రోల్ కాదు నెగటివ్ రోల్ కాదు మంచి రోల్ వస్తే చేయడానికి రెడీ ఉన్నా" అంటూ రాధ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.