English | Telugu
గురువుకు ద్రోహం చేసి వచ్చారనే మాటలు చాలా బాధిస్తాయి
Updated : Jul 6, 2023
ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ లో తన గురువైన రాకేష్ మాష్టర్ ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు శేఖర్ మాష్టర్. ఈ షో ఎండింగ్ లో బ్యాక్ డ్రాప్ లో రాకేష్ మాష్టర్ ఓల్డ్ ఢీ షో వీడియోని ప్లే చేశారు. "నాకు పెళ్లి కాకముందే ఒక కొడుకు..శేఖర్...ఆకలిగా ఉన్నా కూడా నన్ను వదిలి వెళ్ళేవాడు కాదు...నాతోనే ఉండేవాడు. వాడు ఉంటే నేను బతికినట్టే" అని రాకేష్ మాష్టర్ చెప్పిన వీడియోని చూపించారు. దీనికి శేఖర్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. "నేను హైదరాబాద్ వచ్చాక మాష్టర్ తో నాది ఏడెనిమిదేళ్ళ జర్నీ...తిరుపతిలో రాకేష్ మాష్టర్ చాలామందిని రెడీ చేశారు.
ఆయన హైదరాబాద్ కి రావడమే మాష్టర్ గా వచ్చారు. కరెక్ట్ గా అదే టైంలో మేము విజయవాడలో మస్తాన్ మాష్టర్ దగ్గర నేను, సత్య డాన్స్ నేర్చుకుంటున్నాం ...మేమున్నప్పుడు మాష్టర్ కి డ్రింక్ అనేదే అలవాటు లేదు. తర్వాత్తర్వాత వేరే ఫ్రెండ్ షిప్స్, వేరే వాళ్ళ కారణంగా మందు అలవాటయ్యింది. కొంతమంది కావాలని మందు బాటిల్స్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆయనతో తాగించి, ఆయనతో మాట్లాడించి నెగటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేశారు. ఆయన్ని కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగా మాట్లాడతారు. చాలామందికి తెలిసీ తెలియకుండా మాట్లాడేసరికి నా మనసు చాలా బాధపడుతోంది. ఎంత కష్టపడి వచ్చానో నాకు తెలుసు. అంత కష్టపడి వచ్చిన గురువుకే ద్రోహం చేసి వచ్చారు అని అంటున్నారు..ఈ మాటలు విన్నప్పుడల్లా చాలా బాధేస్తుంది..చెప్పాలంటే నేను ఒకరికి ద్రోహం చేయలేదు...మా గురువుగారు ఏ టైంకి పిలిచినా వెళ్ళేవాళ్ళం...పెళ్ళైనా, అర్ధరాత్రి ఐనా..మాకు మాకు చిన్న విషయాల్లో వచ్చిన మనస్పర్థల వలన చేయలేదు దానికి మీరంతా ఏదేదో రాసుకుని..ఏదేదో చేసేస్తున్నారు. మేము ఆయన దగ్గర లేనప్పుడు కూడా అదే అనుకున్నాం ఆయన ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అని..మా మాష్టర్ పైనుంచి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని కోరుకుంటున్నా" అని కన్నీళ్లు పెట్టుకున్నారు శేఖర్ మాష్టర్.