Read more!

English | Telugu

వైఫ్ విషయంలోనే కాదు...అమ్మానాన్నల విషయంలో కూడా ఈ డివోర్స్ ఉంటే విడిపోయేవారు

విడాకులు అనే పదానికి కొత్త అర్ధం చెప్పారు నాగ శౌర్య. "నిఖిల్ తో నాటకాలు" యూట్యూబ్ షో లో  నిఖిల్ విజయేంద్ర సింహ శౌర్యను "అరేంజ్డ్ మ్యారేజా..లవ్ మ్యారేజా" అనే ప్రశ్నకు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. "ఒక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకున్నారు చేసుకున్నాం" అని చెప్పాడు. "ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే 70 పెర్సెంట్ లవ్ మ్యారేజెస్ చేసుకున్నవాళ్లు, 30 పెర్సెంట్ అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళను చూసాను..ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ లో చాలామంది విడిపోతున్నారు. అందుకే ఈ ప్రశ్నను అడిగాను..పెళ్ళైన వెంటనే డివోర్స్ అనే ఒక న్యూస్ వచ్చేస్తుంది" ఎందుకు అని అడిగాడు నిఖిల్.

"లవ్ మ్యారేజెస్ లో డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఇప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. మన జనరేషన్ లో కిడ్స్ కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్లలో వాళ్ళను లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా కంఫర్ట్ గా , హ్యాపీగా ఉంటుంది అనుకుని చేసుకుంటున్నారు. కానీ గొడవలు అయ్యాయి  అంటే విడిపోయే ఆప్షన్ ఒక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో ఉంది. కానీ అమ్మతో, నాన్నతో, అన్నతో ఎందుకు ఈ ఆప్షన్ లేదు. ఉండి ఉంటె చాలామంది కూడా విడిపోయేవారు. అమ్మ, నాన్న ఎలాగో లైఫ్ పార్ట్నర్ కూడా అలాగే అనుకుంటే డివోర్స్ అనే మాటే రాదు. నాకు లిమిటెడ్ గా డబ్బులుంటే చాలు...అంతే కానీ నేను డబ్బు కోసం పరిగెత్తను..అలా పరిగెడితే మాత్రం మనం మన ఫ్రెండ్స్ ని కోల్పోవాల్సి వస్తుంది. నేను నా వైఫ్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. పెళ్లి చేసుకున్నాక సడెన్ గా  నేను వచ్చేసి చెప్పి వెళ్ళు, చెప్పులేసుకెళ్ళు అని ఆమెకు  చెప్పడానికి నేనేమీ కంట్రోలర్ ని కాదు కదా..తన హజ్బెండ్ ని..." అని చెప్పారు శౌర్య.