English | Telugu

రియాజ్ గాడి వల్ల మా ఫ్లైట్ మిస్ అయింది.. యూట్యూబ్ లో ట్రెండింగ్!

సద్దాం.. పటాస్‌ షో ద్వారా ఫేమస్‌ అయ్యాడు. తనదైన పంచులతో ఆ షో జడ్జ్‌లని కడపుబ్బా నవ్వించే సద్దాం.. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఎన్నో స్కిట్లు చేశాడు. ఇతని స్కిట్ల కోసమే సగం మంది శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారనేది వాస్తవం. ఎందుకంటే సెటైరిల్‌ డైలాగ్స్‌తో, అతని తోటి టీమ్‌ సభ్యులపై పంచ్‌లు వేస్తూ నవ్విస్తుంటాడు. అయితే కొన్ని నెలల క్రితం జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సద్దాం.

సద్దాం, యాదమరాజు కలిసి ఒకేసారి జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్‌ షోలో రాఘవ, బుల్లెట్‌ భాస్కర్‌ స్కిట్స్‌ తర్వాత మళ్లీ అంతటి ఫ్యాన్‌ బేస్‌ వచ్చింది సద్దాం స్కిట్స్‌కే అని అనడంలో ఆశ్చర్యం లేదు. అప్పట్లో సద్దాం, యాదమరాజు కలిసి జబర్దస్త్‌ లో ‘ఓసేయ్‌ రాములమ్మ’ స్పూఫ్‌ చేసారు. ఆ స్కిట్‌ ఫుల్‌ ట్రెండింగ్ లో ఉండేది. అయితే సద్దాం రెండు సంవత్సరాల క్రితం సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ని స్టార్ట్‌ చేశాడు. ఇందులో తన పర్సనల్‌ విషయాలని, టూర్స్‌, లొకేషన్స్‌, స్కిట్స్‌ అంటూ కొన్ని వ్లాగ్‌లని పోస్ట్‌ చేస్తున్నాడు. కాగా ఈ వ్లాగ్‌లకి ఇప్పుడు ఫుల్‌ క్రేజ్‌ వస్తుంది.

సద్దాంకి యూట్యూబ్ లో 1.59 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ' రియాజ్ గాడి వల్ల ఫ్లైట్ మిస్ అయింది ' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేసాడు. ఇందులో నరేశ్, రియాజ్, సద్దాం కలిసి ఎక్కడికో ఈవెంట్ కి వెళ్తుంటారు. అయితే ఫ్లైట్ అయిదు గంటలకి అవుతే రియాజ్, నరేశ్ ఎనిమిదింటికి వచ్చారంటూ తిట్టసాగాడు. మీ వల్ల ముప్పై వేలు బొక్కరా అంటూ సద్దాం ఇద్దరిపై కోప్పడ్డాడు. ఇక ఎయిర్ పోర్ట్ లో వారి కష్టాలని అన్నింటిని ఇందులో చెప్పుకొచ్చాడు సద్దాం. శ్రీదేవీ డ్రామా కంపెనీలో నరేశ్, సద్దాం జోక్స్ ఇప్పటికి ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. సద్దాం యూట్యూబ్ ఛానెల్ లో ఉన్న ఈ వ్లాగ్ ని ఓ సారి చూసేయ్యండి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.