English | Telugu

దీపిక మనసులో మాట బయటపెట్టేసింది!

దీపిక ఫస్ట్ టైమ్ తన మనసులో మాటని బయటపెట్టేసింది. చిన్న చిన్నగా మొదలుకొని పెద్ద లక్ష్యాలని చేరుకోవాలన్నా , సరైన తోడు కావాలన్నా తను చెప్పినట్టు చేయమంటుంది దీపిక రంగరాజు. మరి తనేం చెప్పిందో ఓసారి చూసేద్దాం. బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన దీపికా రంగరాజు. తన యూట్యూబ్ ఛానల్‌ రకరకాల వీడియోలను షేర్ చేస్తూ బిజీగా మారింది. బ్రహ్మముడి సీరియల్‌తో బాగా పాపులర్ కావడంతో.. దీపిక యూట్యూబ్ ఛానల్‌ అతి తక్కువ కాలంలోనే లక్ష పదహారు వేల మంది సబ్ స్క్రైబర్స్‌ని సంపాదించింది దీపిక. ఇక యూట్యూబ్ ద్వారా మంచి ఇన్‌కమ్ జనరేట్ కావడంతో.. ఫుల్ ఫోకస్డ్‌గా తన యూట్యూబ్ ఛానల్‌లో బ్యూటీ, హెల్త్, పర్సనల్ ఇలా రకరకాల వీడియోలను షేర్ చేస్తుంది.

కొన్ని రోజుల క్రితం కావ్య తన యూట్యూబ్ ఛానెల్ లో " బిగ్ బాస్ కి వెళ్తున్నాను. బ్రహ్మముడి ఫ్యామిలీ రియాక్షన్ " అనే వ్లాగ్ చేయగా అది వైరల్ అయింది. తను చేసిన వ్లాగ్స్ లో బాగా పాపులర్ అయినవి కొన్ని ఉన్నాయి.. నా హైదరాబాదు రూమ్ టూర్, బ్రహ్మముడి సీరియల్ లో నా జర్నీ అలా మొదలైంది, సండే స్పెషల్ కి ఫ్రాన్స్ బిర్యాని ట్రై చేశాను వంటి వ్లాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. దీపిక బ్రహ్మముడి సీరియల్ లో సంప్రదాయబద్ధంగా కూల్ అండ్ కామ్ గా ఉంటుంది. అయితే బయట చాలా యాక్టివ్ అండ్ ఫన్నీ గా ఉంటుంది. ప్రతీదానిని స్పోర్టివ్ గా తీసుకుంటూ వస్తున్న కావ్య కామెడి టైమింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ మా పరివారం షోకి వచ్చినప్పుడు శ్రీముఖి, అవినాష్ లని దీప ఆడుకుంది.

ఇక ఇప్పుడు తన మనసులో‌ మాట ఏంటో ఓ వ్లాగ్ లో చెప్పగా.. అందరూ ఏంటా అనే క్యూరియాసిటితో చూస్తున్నారు. అసలు ఇందులో ఏం ఉందంటే.. త‌న ఫ్రెండ్ ఒకరు చాలా డిప్రెషన్ లో ఉందని, ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకుంటే తనకి ఫ్రెండ్స్ లో నమ్మదగినవారు ఎవరు లేరని, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని చెప్పిందంట. దాంతో కావ్య తనకి ఓ ఫ్రెండ్ ఆప్ ఉందని, అందులో జెన్యుయన్ గా ఉండేవాళ్ళు ఉంటారని, మీ ఫోటోని కూడా అప్లోడ్ చేయనవసరం లేదని చెప్పుకొచ్చింది. దాంతో తను ఆ ఆప్ యూజ్ ఇన్ స్టాల్ చేసుకుని తన బాధని, ఫీలింగ్స్ ని షేర్ చేసుకొని ఇప్పుడు నార్మల్ అయిందని కావ్య చెప్పుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.