English | Telugu
అమ్మో సదా...ఇంత టాలెంటెడ్ ఆ ...
Updated : May 20, 2024
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన 'జయం' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సదా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. కానీ టీవీ రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఆమె వయసు 39 ఏళ్లకు చేరుకుంది. ఐనా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. రీసెంట్ గా ఆమె నీతోనే డాన్స్ 2 . 0 షోకి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ షోలో ఈ వారం సదా తన టాలెంట్ మొత్తాన్ని చూపించింది. ఈ శనివారం జరిగిన ఎపిసోడ్ లో అమరదీప్ - తేజు జోడీగా చేసిన కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాంతో సదా కూడా స్టేజి మీదకు కథక్ చేసి అందరితో వ్వావ్ అనిపించుకుంది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో యావర్-వాసంతి కృష్ణన్ జోడి లావణి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.
ఆ డాన్స్ స్టైల్ కి ఫిదా ఐపోయిన సదా వెంటనే స్టేజి మీదకు వెళ్లి ఆ లావణి డాన్స్ చేసి చూపించింది. తన కాస్ట్యూమ్ మొత్తం కూడా వాళ్ళ అమ్మగారే అలంకరించారని ఆ డాన్స్ స్టైల్ అంటే వాళ్ళ అమ్మకు ఎంతో ఇష్టం అని ఆమె కోసం ఒక్కసారైనా లావణి డాన్స్ చేయాలనుకుంటే ఇప్పుడే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది సదా. ఏదేమైనా సదా మల్టీ టాలెంటెడ్ లేడీ. యాక్టర్ గా డాన్సర్ గా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా అన్ని రంగాల్లో ముందుంటుంది సదా. ఐతే సదా మాత్రం పెళ్లి చేసుకోనని తనకు పెళ్లి అంటే ఇంటరెస్ట్ లేదని చెప్పేసింది. పెళ్లి చేసుకునే వ్యక్తి అర్థం చేసుకునే వాడు కావచ్చు, కాకపోవచ్చు అంటూ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పేసింది.