English | Telugu

పడ్డోడెప్పుడూ చెడ్డోడు కాదని మా అమ్మ చెప్పింది అన్న అనసూయ

అనసూయ నిన్న మొన్నటి వరకు బుల్లితెర మీద గ్లామరస్ యాంకర్. తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. ఇప్పుడు బుల్లితెరను పూర్తిగా వదిలేసి, కాన్సంట్రేషన్ మొత్తాన్ని మూవీస్ వైపుకు మళ్లించేసింది. సోషల్ మీడియాలో అనసూయ ఫుల్ యాక్టివ్ అనే విషయాన్ని మరో సారి ప్రూవ్ చేసుకుంది. "కాసేపు మాట్లాడుకుందాం రండి" అంటూ ఫాన్స్ ని క్వశ్చన్స్ అడగమంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇన్వైట్ చేసింది.

అలా వచ్చిన వారిలో ఒక నెటిజన్ "మీ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా మీరెప్పుడు ఫీల్ కాలేదు..ఆ ధైర్యాన్ని, ఆ స్పిరిట్ ని వదల్లేదు" అనేసరికి "ఎందుకంటే మా అమ్మ నేర్పించింది..పడ్డోడెప్పుడూ చెడ్డోడు కాదు అని..ఎదుటి వాళ్ళు మనల్ని ఏం అన్నా అది వాళ్ళ క్యారెక్టర్ ని బయటకు చూపిస్తుంది. మన క్యారెక్టర్ ఏమిటో మనకు తెలుసు...ప్రూవ్ చేయాల్సిన, చేసుకోవాల్సిన అవసరం లేదు..మిగతా వారికీ చేయాల్సిన అవసరం లేదు" అని చెప్పింది. "ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లకు మీరు ఏం సజెషన్ ఇస్తారు" అని మరో నెటిజన్ అడిగేసరికి " నువ్వెంటో నిరూపించుకో...నీలాగే ఉండు. ఏది వదులుకోవద్దు...అలా అని పరిస్థితులకు తగ్గట్టు మారిపోవద్దు..అంతే కాదు ప్రతీ నిమిషం చాలా అలెర్ట్ గా ఉండు" అని సలహా ఇచ్చింది.

"అక్కా మీరు గర్ల్స్ కి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు కదా. మోటివేషన్ లా ఒక మాట చెప్పండి" అనేసరికి "సమయం, ఎనర్జీ, స్పేస్ వీటి విలువ ముందుగా తెలుసుకో. వీటిని ఎలా వినియోగించుకోవాలో ఆలోచించుకో" అని అద్భుతమైన వాక్యం ఒకటి చెప్పింది అనసూయ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.