English | Telugu
బ్యాక్ టు బ్యాక్ రెండు కొత్త సీరియల్స్ తో సందడి చేయబోతున్న స్టార్ మా
Updated : Dec 14, 2023
తెలుగు ఆడియన్స్ కి స్టార్ మా గుడ్ న్యూస్ చెప్పేసింది. లేటెస్ట్ గా ఒక అప్ డేట్ ఐతే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక కొత్త సీరియల్స్ సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. ఒకటి కాదు ఏకంగా రెండు సీరియల్స్ పట్టాలెక్కించింది స్టార్ మా. అదే ఊర్వశివో-రాక్షసివో ఒకటి అలాగే యష్-వేద జోడి నటిస్తున్న సత్యభామ సీరియల్స్. ఈ రెండు సీరియల్స్ కూడా వన్ బై బై రాబోతోన్నయి.
సత్యభామ సీరియల్ రాత్రి 9 .30 గంటలకు ప్రసారమవుతుండగా, ఊర్వశివో-రాక్షసివో సీరియల్ రాత్రి 10 గంటలకు రాబోతోంది. ఈ రెండు సీరియల్ ఈ నెల 18 సోమవారం నుంచి బుల్లితెర మీద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఊర్వశివో-రాక్షసివో సీరియల్ లో వినయ్ సింధియా హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో ఇతనికి ఇదే మొదటి సీరియల్. అలాగే హీరోయిన్ గా కేరళ అమ్మాయి ఆయేషా నటిస్తోంది. ఈమె సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటించింది.
తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా ఆయేషా ఎంట్రీ ఇచ్చి వచ్చింది. ఇక ప్రగతి ఈ సీరియల్ నెగటివ్ రోల్ లో కనిపించబోతోంది. ఇక సత్యభామ సీరియల్ కూడా తెలుగు అభిమానులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. ఎందుకంటే ఈ సీరియల్ లో కనిపించబోతున్న యష్- వేద జోడి ఆల్రెడీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో అలరించింది. ఇక వీళ్ళ కాంబోలోనే మరో సీరియల్ వస్తుండడంతో ఆడియన్స్ కి పండగే పండగ అని చెప్పొచ్చు.