English | Telugu

కాబోయే వాడిని ప‌రిచ‌యం చేసి షాకిచ్చిన జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ!

గ‌త కొన్ని రోజులుగా కిరాక్ ఆర్పీ కార‌ణంగా నెట్టింట వైర‌ల్ గా మారిన కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. టీమ్ లీడ‌ర్ల విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారిన ఈ షోలో మ‌హిళా కంటెస్టెంట్ లు కూడా భారీ స్థాయిలోనే వున్నారు. శాంతి స్వ‌రూప్ లాంటి వాళ్ల త‌ర‌హాలో లేడీ గెట‌ప్ లు వేసే వాళ్లువున్నా మ‌హిళా కంటెస్టెంట్ లు కూడా చాలా మందే వున్నారు. స‌త్య‌శ్రీ‌, వ‌ర్ష‌, రోహిణి, ఫైమా లాంటి వాళ్లు ఆటో రాంప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది, బుల్లెట్ భాస్క‌ర్ త‌ర‌హాలో కామెడీ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

సీరియ‌ల్స్ లో న‌టిస్తున్న రీతూ చౌద‌రి కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన స్టైల్లో కామెడీ స్కిట్ లు చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. హైప‌ర్ ఆదితో క‌లిసి స్కిట్ లు చేస్తూ వస్తున్న రీతూ చౌద‌రి త్వ‌ర‌లో జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ కు షాకివ్వ‌బోతోంది. బుల్లితెర‌పై ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మ‌కోసం వంటి సీరియ‌ల్స్ లో న‌టించిన రీతూ చౌద‌రి అక్క‌డ బిజీగా వుంటూనే జ‌బ‌ర్ద‌స్త్ షోలోనూ పాల్గొంటోంది. టైమ్ చిక్కిప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్ అవుతూ వ‌స్తోంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ తో వ్య‌క్తిగ‌త విష‌యాల‌ని వెల్ల‌డించే రీతూ చౌద‌రి తాజాగా త‌నకు కాబోయే వాడిని ప‌రిచ‌యం చేసి షాకిచ్చింది. నీ బంధం కంటే విలువైన‌ది ఏదీ లేదంటూ కామెంట్ చేసింది. త‌న‌కు కాబోయే భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ని అభిమానుల‌కు షేర్ చేసింది. అత‌ని పేరు శ్రీ‌కాంత్‌. రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన వ్య‌క్తిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పెళ్లితో రీతూ జ‌బ‌ర్ద‌స్త్‌కి గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మ‌ని, త‌న వ‌ల్ల జ‌బ‌ర్ద‌స్త్ కు మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.