English | Telugu
జబర్దస్త్.. ఇంద్రజ పెళ్లికి అతిథులు 13 మందేనట!
Updated : Jul 17, 2022
సుడిగాలి సుధీర్, కిరాక్ ఆర్పీ కారణంగా జబర్దస్త్ షో కాస్తా గత కొన్ని రోజులుగా రచ్చ రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఆర్పీ విమర్శలకు హైపర్ ఆదితో పాటు ఆటో రాంప్రసాద్ కౌంటర్లు ఇస్తూ వచ్చారు. తాజాగా ఈ షో మాజీ మేనేజర్ కిరాక్ ఆర్పీతో పాటు సుడిగాలి సుధీర్ లపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ జబర్దస్త్ షో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇదిలా వుంటే ప్రతీ గురువారం అందర్నీ నవ్విస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న కామెడీ షో జబర్దస్త్.
గత కొంత కాలంగా హాస్య ప్రియుల్ని ఈ షో విశేషంగా ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంటోంది. తాజా ఎపిసోడ్ కోసం సరికొత్త స్కిట్లతో సిద్ధమైంది. ఈ నెల 21న ఈటీవీలో ప్రసారం కానున్నఈ షోకు సంబంధించిన తాజా ప్రోమోని రీసెంట్ గా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో కమెడియన్ వెంకీ వైఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. వారిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తాజా ఎపిసోడ్ లో చెప్పేశారు.
ఇక ఇదే వేదికపై తనది ప్రేమ పెళ్లని చెప్పిన వెంకీ ఆ వెంటనే ఇంద్రజ పెళ్లి గురించి అడిగాడు. మీది అరేంజ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా అని అడిగితే ఇంద్రజ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. మాది లవ్ మ్యారేజ్ అని, పెళ్లికి కేవలం 13 మంది మాత్రమే హాజరయ్యారని, పెళ్లికి అయిన ఖర్చు 7,500 మాత్రమేనని చెప్పి షాకిచ్చింది. ఇదే సందర్భంగా మనో పెళ్లి గురించి అనసూయ అడగడంతో ఆయన కూడా తన పెళ్లిగురించి చెప్పేశారు. తను చిన్న వయసు నుంచే సంపాదించడం మొదలు పెట్టానని, అందుకే తనకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారని చెప్పేశాడు. ఈ నెల 21న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.