English | Telugu
స్వప్నకి గన్ పెట్టిన మైఖేల్.. రాహుల్ ప్లాన్ తెలిసిపోనుందా!
Updated : Sep 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -211 లో.. బొద్దింకని చూసి రాజ్ భయపడడంతో కావ్య కావాలనే ఆటపట్టిస్తుంటుంది. ఆ తర్వాత నాకు భయం లేదని రాజ్ కవర్ చెయ్యాలని ప్రయత్నం చేసిన కావ్య వినదు. మీరు నన్ను ఎత్తుకొని పది నిమిషాలు ఉంటే మీకు భయం లేదని ఒప్పుకుంటానని కావ్య అనగానే.. రాజ్ కావ్యని పది నిమిషాలు ఎత్తుకుంటాడు.
మరొక వైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేస్తుంటుంది కానీ కళ్యాణ్ మాత్రం అనామికతో ఫోన్ లో మాట్లాడుతూ.. అప్పు చేసిన పట్టించుకోడు. మరొక వైపు రాజ్ ఉదయం స్కిప్పింగ్ చేస్తూ ఉండగా.. కావ్య వచ్చి చాలా రోజుల తర్వాత ఎక్ససైస్ చేస్తున్నారని అడుగుతుంది. ఇప్పటికి వంద చేశాను, నువ్వైతే ఇరవై కూడా చెయ్యలేవని రాజ్ అంటాడు. నేను చెయ్యగలనని కావ్య అంటుంది. అక్కడే ఉన్న సీతరామయ్య.. రాజ్ నువ్వు తగ్గొద్దు, ఆపకుండా చేయమని అంటాడు.
అక్కడే ఉన్న ఇందిరాదేవి.. నువ్వు కూడా ఆపకుండా స్కిపింగ్ చేయని కావ్యతో చెప్తుంది. ఇద్దరు కలిసి స్కిప్పింగ్ చేస్తుంటారు. అదంతా పై నుండి అపర్ణ కోపంగా చూస్తూ ఉంటుంది. కాంట్రాక్ట్ పూర్తి అయిందన్న ఆనందంలో కావ్య ఉందని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ కి ఆయాసం వచ్చి స్కిప్పింగ్ ఆపుతాడు. కావ్యనే గెలిచిందని ఇందిరాదేవి అనగానే.. లేదు రాజ్ అంతకు ముందు చేశాడు అని రాజ్ కీ సపోర్ట్ గా సీతారామయ్య మాట్లాడుతాడు.
మరొక వైపు అప్పు కర్ర పట్టుకొని వచ్చి.. కళ్యాణ్ ని కొడుతుంది. నన్ను ఎందుకు కొడుతున్నవని కళ్యాణ్ అడుగగా.. నిన్న వస్తానని చెప్పి రాలేదని కోప్పడుతుంది. ఆ తర్వాత అనామిక కళ్యాణ్ కి ప్రపోజ్ చేసిన విషయం చెప్తాడు. అయిన సరే అప్పు కళ్యాణ్ చెప్పింది వినకుండా కోపంగా వెళ్ళిపోతుంది. మరొక వైపు కనకం-కృష్ణమూర్తి వాళ్ళింటికి డబ్బుల కోసం సేట్ వస్తాడు. ఇక రెచ్చిపోయిన కనకం సేట్ ని తిడుతుంది. నాకు రెండు రోజుల్లో డబ్బులు కావాలని చెప్పి సేట్ వెళ్ళిపోతాడు. మరొక వైపు స్వప్నకి రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు రాహుల్. అప్పుడే వెనకాల నుండి మైఖేల్ వచ్చి.. స్వప్న తలపై గన్ పెడతాడు. రాహుల్ ఏం తెలియనట్లు యాక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.