English | Telugu

యూట్యూబ్ ట్రెండింగ్ లో 'రెడ్డిగారు' వెబ్ సిరీస్‌!

ఏమండోయ్ రెడ్డి గారు ఏంటిది.. మీరు నా జీవితంలోకి రాకముందు నాకొక లైఫ్ ఉంది కదా అదే ఇది.. అని ప్రసాద్ బెహరా మాటలతో " రెడ్డిగారు" సిరీస్ మొదలైంది.

ప్రశాంత్ రగతి రాసిన ఈ కథకి జెడీవి ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శ్రీజ రెడ్డి, చందు జెసి, జెడీవీ ప్రసాద్, సాత్విక్ జి రాయ్ ప్రధాన పాత్రలుగా ఈ సిరీస్ మొదలైంది. 'మా విడాకులు' వెబ్ సిరీస్ తో ప్రసాద్ బెహరా, విరాజిత యూట్యూబ్ లో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ప్రసాద్‌ బెహరా కామెడీ టైమింగ్ , డైలాగ్ డెలివరీ కోసం ఎంతోమంది నెటిజన్లు తను చేసిన ఈ మా విడాకులు వెబ్ సిరీస్ లోని అన్ని ఎపిసోడ్ లని చూసి ఆదరించారు. అదేవిధంగా విరాజిత, ప్రసాద్ బెహరా, ఇంకా కొంతమంది కలిసి 'పెళ్ళి వారమండి' అనే వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేశారు. ఇది మొత్తంగా పది ఎపిసోడ్ లతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో ప్రసాద్ బెహరాకి సినిమా అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. ‌ఇక ఈ సిరీస్ లో ప్రసాద్ బెహరాతో సరిసమానంగా చేసిన రెడ్డిగారు అలియాస్ జెడీవీ ప్రసాద్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఇతను కొత్తగా "రెడ్డి గారు" అనే సిరీస్ ని మొదలెట్టాడు.

ఈ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయి కేవలం అయిదు రోజులో అయింది కానీ తొమ్మిది లక్షల వ్యూస్ తెచ్చుకుంది. దీన్ని బట్టి ఇది ఎంత హిట్ అవుతుందో తెలిసిపోతుంది. ఇక ఈ సిరీస్ లో రెడ్డి బిటెక్ చదివి ఉద్యోగం కోసం చాలా కష్టాలు పడుతుంటాడు. అయిదు సంవత్సరాలు ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టి జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు. రెడ్డిగారి వాళ్ళ నాన్న ఊళ్ళో బాగా అప్పులు చేయడం.. రెడ్డికి ఇద్దరు చెల్లెళ్ళు ఉండటంతో.. అతనిమీద కుటుంబ భారం పడుతుంది. అదేసమయంలో రెడ్డికి ఓ జాబ్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ. యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్న ఈ వెబ్ సిరీస్ ని చూడకపోతే ఓసారి చూసేయ్యండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.