English | Telugu

నరసింహా భార్య శ్వేత ఆస్తి చూసి ఫిదా అయిన అనసూయ.. పాపం దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 36 లో.. కార్తీక్ ఇంటికి రాగానే ఊరు వెళ్లిపోతున్న వాళ్ళని ఇంటికి తీసుకొని రావడం, ఇంకా బాధ్యత కూడా తీసుకోవడం చేస్తున్నారు అంట కదా అని కార్తీక్ వాళ్ళ నాన్న అంటాడు. ఎవరో వెళ్తుంటే నీ చున్ని టైర్ లో ఇరుక్కుంటుందంటూ జాగ్రత్త చెప్తాం అలాంటిది ఒక సాటి మనిషిగా సాయం చెయ్యలేమా అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత కార్తీక్ వెళ్ళిపోతాడు. నేను ఏదో సరదాకి అంటే వాడేంటి అలా మాట్లాడి వెళ్ళిపోయాడని కార్తీక్ నాన్న అంటాడు. మీరేం అనకండి అంటు కాంచన అంటుంది. దీపని వెళ్లకుండా సుమిత్ర ఆపింది కానీ పాపం దీపకేం కష్టాలు ఉన్నాయో అని కాంచన అంటుంది. మరొకవైపు నీ భర్త నిన్ను ఇంత మోసం చేసాడని ఎందుకు చెప్పలేదని దీపని సుమిత్ర అడుగుతుంది. వాడి సంగతి చెప్పి నీకు న్యాయం జరిగేలా చూస్తానని సుమిత్ర అనగానే.. వాడికి బుద్ది చెప్పి దీప జీవితం బాగు చేస్తానని అనసూయ అంటుంది. మీరు ఆ పని చేయకుంటే నేను చేస్తానని సుమిత్ర అంటుంది. రేపు ప్రొద్దున వాడి దగ్గరికి వెళ్లి వాడికి బుద్ది చెప్తాను.. నా కోడలికి అన్యాయం చేస్తాడా అని అనసూయ అంటుంది.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అనసూయని తీసుకొని దీప .. నర్సింహా దగ్గరికి వెళ్తుంది. అక్కడ అనసూయని చూసి నర్సింహా భయపడతాడు. అప్పుడే శోభ వచ్చి.. నువ్వేంటి దాని కాళ్ళ దగ్గర ఉన్నావని అంటుంది. అమ్మ నన్ను క్షమించు అని నర్సింహా అనసూయతో అంటాడు. ఎందుకు ఇలా చేసావని అనసూయ అనగానే.. దీప అంటే ఇష్టం లేదు అందుకే... నేనే మూడు నెలలో వచ్చి అప్పులు తీరుద్దామని అనుకున్నాను..‌ కానీ ఆలోపే దీప వచ్చింది. ఇంటికి వెళ్లే అంటే ఒక డబ్బులున్న అతన్ని పట్టింది. వాడి చేత నన్ను కొట్టించింది ఇంకా దాని దగ్గరకి వెళ్లి ఊరు వెళ్ళమని చెప్తే ఒకావిడతో కొట్టించిందని నర్సింహా చెప్తాడు. దీప కూడా కొట్టారని చెప్పగానే.. అనసూయ నర్సింహా మాటలు నమ్ముతుంది.. ఆ తర్వాత మా అమ్మ కోటి రూపాయల విలువ గల ఇల్లు ఇచ్చింది.. పది లక్షల టాక్సీ కొనిచ్చింది.. నాకు బంగారం చేయించిందని శోభ అనగానే.. ఇదంతా బంగారమేనా అని అనసూయ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.