English | Telugu

మానవత్వాన్ని చాటుకున్న ప్రిన్స్ యావర్!

నీతోనే డ్యాన్స్ 2.0 లో యావర్ కి జోడీగా నయని పావని ఉండగా.. సడన్ గా కొన్ని అనివార్య కారణాల వల్ల నయని విశ్వతో కలిసి జతకట్టింది. ఇప్పుడేమో యావర్ తో వాసంతి కృష్ణన్ జతకట్టి డ్యాన్స్ అదరగొడుతున్నారు. తాజాగా ఈ షోలో యావర్ పర్ఫామెన్స్ కి సదా ఫిధా అయింది. ఏకంగా స్టేజ్ మీదకి వచ్చి మరీ యావర్ కి హగ్ ఇచ్చింది.

బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్నవారిలో యావర్ కూడా ఒకడు. బిగ్ బాస్ సీజన్-7 మొదలవ్వడమే ఉల్టా పల్టాగా మొదలైంది‌. ఇందులో మొదటగా పదమూడు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా అందులో ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ ముగ్గురు కలిసి స్పై బ్యాచ్ గా కలిసి ఉన్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో యావర్ కి మొదట భాష ప్రాబ్లమ్ అవ్వగా.. మెల్లి మెల్లిగా శివాజీతో చేసిన స్నేహం అతడిలోని మంచివాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. హౌస్ లో మొదటగా ఎవరేమన్నా అగ్రెసివ్ గా ఉండే యావర్ లో ప్రశాంత్, శివాజీ కలిసాక మార్పు మొదలైంది‌. ఏదైన మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడటం నేర్చుకున్నాడు. స్నేహంగా ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు యావర్. సీజన్ సెవెన్ ముగిసాక ప్రశాంత్ జైలులో ఉన్నప్పుడు తన మద్దతుని తెలిపి అండగా నిలిచాడు. ఆ తర్వాత శివాజీ, భోలే షావలి, ప్రశాంత్ లతో కలిసి విందు భోజనం చేశాడు యావర్. 'గుంటూరు కారం' సినిమాలోని ' ఆ కుర్చీని మడతబెట్టి' సాంగ్ కి నయని పావనితో కలిసి యావర్ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటింది‌.

ఇక ఇప్పుడు తాజాగా కొంతమంది అనాధ పిల్లలకి అన్నదానం చేశాడు. అయితే వారితో కలిసి సరదాగా గడిపిన యావర్ .. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. యావర్ కి ఇన్ స్టాగ్రామ్ లో 243K ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. అటు డ్యాన్స్ షో.. ఇటు సోషల్ నెట్‍వర్కింగ్ సైట్లలో ఫోటోషూట్ లతో యావర్ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కాగా యావర్ చేసిన ఈ మంచి పనికి నెటిజన్ల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. మరి యావర్ షేర్ చేసిన ఈ వీడియోని మీరు చూశారా లేదంటే ఓసారి చూసేయ్యండి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.