English | Telugu
కన్నీళ్ళతో బయటకొచ్చిన సూర్య!
Updated : Oct 31, 2022
బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉన్నంత సందడిగా, ఎలిమినేట్ అయి బయటకొచ్చేస్తుంటే ఉండదు. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ చూసి అటు హౌస్ మేట్స్ తో పాటు, ఇటు ప్రేక్షకులు బాగా ఎమోషనల్ అవుతారు. కాగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఒక ఎమోషనల్ డ్రామాగా కొనసాగింది. అయితే నిన్న మొన్నటి దాకా సూర్య టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేస్తూ, బెస్ట్ పర్ఫామర్ గా కొనసాగుతూ, బెస్ట్ పర్ఫామర్స్ లిస్ట్ లో టాప్-5 కంటెస్టెంట్ గా ఉంటాడని అందరు అనుకున్నారు.
అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ బిగ్ బాస్ సూర్యని ఎలిమినేట్ చేసాడు. అయితే ప్రతీ వారం ఎలిమినేషన్ ప్రకియ అనేది ఒక్కో కంటెస్టెంట్ ని సేవ్ చేస్తూ రాగా, ఈ సారి కాస్త భిన్నంగా కొనసాగింది. ఏంటంటే శనివారం రోజు నాగార్జున వచ్చి, "ఈ సారి ఒక్కో కంటెస్టెంట్ ని సేవ్ చేస్తూ రావడం అనేది లేదు. డైరెక్ట్ గా ఎలిమినేషన్ ఉంది" అని బాంబు పేల్చాడు. దాంతో హౌస్‌మేట్స్ అందరు షాక్ అయ్యారు. ఆ తర్వాత సూర్య ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున చెప్పేసరికి అందరు అవాక్కయ్యారు. ఎలిమినేషన్ తర్వాత ఫైమా, ఇనయా బాగా ఏడ్చేసారు. ఎందుకంటే సూర్య వీరికి బాగా దగ్గరయ్యాడు.
సూర్య హౌస్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు, ఇనయా మాట్లాడుతూ, "ఐ మిస్ యూ రా. ప్లీజ్ రా.. వెళ్ళకు రా" అని హగ్ చేసుకొని బాగా ఏడ్చేసింది. ఇది చూసి హౌస్‌మేట్స్ అందరు ఎమోషనల్ అయ్యారు. అయితే శనివారం తన ఏవీని చూపించలేదు. "సండే కలుద్దాం" అని చెప్పి వెళ్ళిపోయాడు నాగార్జున.