English | Telugu
ఊడిపోయిన ఇమ్ము జుట్టుతో విల్లా కొన్న వర్ష!
Updated : Oct 31, 2022
జబర్దస్త్ మాదిరి గానే ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ఆడియన్స్ ని కొంచెం ఎక్సట్రాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఈ వారం జడ్జెస్ గా ఖుష్బూ బదులు పోసాని కృష్ణమురళి జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో వర్ష, ఇమ్మానుయేల్ స్కిట్ కొంచెం ఫన్నీగా ఉంది. "ఇమ్మూ! నీకు జుట్టు లేదని ఫీల్ అవ్వకు" అని వర్ష అనేసరికి, "నా ఊడిపోయిన జుట్టుతో ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కొంటోందండి" అని ఇమ్ము చెప్పాడు.
"నీ ఊడిపోయిన జుట్టుకు సామాన్లు కూడా వస్తాయా?" అని రష్మీ కౌంటర్ వేసింది. "ముందు పోయిన జుట్టుతో విల్లా కొన్నది తెలుసా!" అని ఇమ్ము రివర్స్ కౌంటర్ వేసాడు. తర్వాత గెటప్ శీను స్కిట్ లో విమానాలకు కూడా ఇంజిన్ ఆయిల్ మార్చే ఫన్నీ కాన్సెప్ట్ అందరికీ నవ్వు తెప్పించేదిగా ఉంది. ఇక ఫైనల్ గా నాటీ నరేష్ కి, మరోచైల్డ్ ఆర్టిస్ట్ కి పోసాని స్టేజి మీదకు వచ్చి చెరో రూ. 500 ఇచ్చి వాళ్ళను బ్లెస్ చేశారు.