English | Telugu

ఫ్లూట్ తో మేజిక్ చేసిన అంధ బాలుడు భువనేష్

'సూపర్ సింగర్ జూనియర్స్' శని, ఆదివారాలు మంచి మ్యూజికల్ ట్రీట్ ని అందిస్తోంది. ఇందులో ప్రతీ వారం ఒక స్పెషల్ థీమ్ అనౌన్స్ చేశాక దాని మీద ఉన్న సాంగ్స్ ని పిల్లలు ఎంచుకుని పాడుతూ ఉంటారు. ఇక రాబోయే సూపర్ సింగర్ జూనియర్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ థీమ్ 'నేచర్' అన్నమాట. ప్రకృతి మీద పాటలు పాడి చిన్నారులు అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక స్టేజి సెటప్ మొత్తం కూడా ఆకులు, చెట్లతో డెకరేట్ చేసేసరికి "మనమంతా ఏదో అడవిలో ఉన్నట్లు ఉంది" అన్నాడు హోస్ట్ సుడిగాలి సుధీర్. "ఇన్నాళ్టికి ఒక కరెక్ట్ విషయం చెప్పావ్ సుధీర్" అని పంచ్ వేసింది అనసూయ.

"ఐతే ఇక్కడ ఉన్న చెట్ల పేర్లు చెప్పండి" అని అడిగాడు సుధీర్‌. "వేప చెట్టు, మామిడి చెట్టు" అని జ‌వాబిచ్చింది అన‌సూయ‌. "మరి మామిడికాయలు ఏవి?" అని అడిగాడు. "అదేమో చింతచెట్టు" అంది అనసూయ. "మరి చింతకాయలు ఏవి?" అన‌డిగాడు. "ఐ థింక్ అవి ఎల్లో ఫ్లవర్స్" అని అనసూయ అనేసరికి "చింత చెట్టుకు ఎల్లో ఫ్లవర్స్ ఏంటండీ" అన్నాడు సుధీర్‌, కామెడీగా. ఇక "ఈ ఎపిసోడ్ అంతా చెట్టు మీద కోయిలలు కూస్తున్నట్టు హాయిగా వినసొంపుగా ఉంటుంది కదా" అంది అనసూయ. ఫస్ట్ కంటెస్టెంట్ గా థమన్ వచ్చి "పచ్చనిదనమే పచ్చదనమే" అంటూ పాడేసరికిజడ్జి కూడా "ఇట్స్ ఏ రాకింగ్ పెర్ఫార్మెన్స్" అంటూ మెచ్చుకున్నారు.

తర్వాత దామిని వచ్చి "మెరిసింది మేఘం మేఘం" అనే పాట పాడి స్టేజి మొత్తాన్ని హాయిగా మార్చేసింది. దామినిని జడ్జెస్ మొత్తం బాగుందని పొగిడారు. "యూ హావ్ ఏ ఫెంటాస్టిక్ ఆటిట్యూడ్" అంటూ మాల్గాడి శుభ కితాబిచ్చారు దామినీకి. ఇక మయూఖ్ "తరలిరాదా తనే వసంతం" సాంగ్ ని ఎక్కడా తప్పుల్లేకుండా అద్భుతంగా పాడేసరికి స్టేజి మీద ఉన్న అందరూ లేచి చప్పట్లు కొట్టారు. హేమచంద్ర విజిల్ వేయ‌గా, జడ్జెస్ అందరు "మయూఖ్ పెర్ఫార్మెన్స్ ఆసమ్" అంటూ ఆ చిన్నారిని హగ్ చేసుకున్నారు. ఇక భువనేష్ వచ్చి "పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం" అంటూ ఫ్లూట్ తో సూపర్ గా పెర్ఫార్మ్ చేశాడు. "భువనేష్ నిన్ను లోకం చూడ్డం కాదు లోకానికి నువ్వో కొత్త లోకం చూపించావ్" అంటూ హేమచంద్ర పాజిటివ్ కామెంట్ ఇచ్చి భువనేష్ లో ఉత్సాహాన్ని నింపాడు.

ఫైనల్ గా ఫ్లూట్ తో మంచి థీమ్ ప్లే చేశాడు భువనేష్. దాంతో స్టేజి మీద ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. ఇక వాళ్ళ నాన్న స్టేజి మీదకు వచ్చి "అందరూ నన్ను బెన్నీ వాళ్ళ ఫాదర్ అంటుంటే చాలా హ్యాపీ గా ఉంది" అని ఆనంద‌పడ్డారు. ఇలా ఈ ప్రోమో ఇప్పుడు సందడి చేస్తోంది. 'కళ్ళు లేకపోతేఏముంది అద్భుతమైన గాత్రం ఉంది అది చాలు, ఇక ఈ వారం ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.