English | Telugu

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రియాంక.. అర్జున్ కి ఉల్టా పుల్టా ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-7 విజయవంతంగా పద్నాలుగు వారాలు పూర్తిచేసుకుంది. ఇక ముగింపుకి వచ్చేసింది. హౌస్ లో ఫినాలే వీక్ నడుస్తోంది. ఇందులో ఒక్కో‌ కంటెస్టెంట్ యొక్క జర్నీ వీడియోలని చూపిస్తున్నాడు బిగ్ బాస్.

అయితే మొదట అమర్ దీప్ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత అంబటి అర్జున్, నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీ జర్నీ, ఆ తర్వాత ప్రియాంక జర్నీ వీడియోలని చూపించాడు బిగ్ బాస్. ఇంకా యావర్, ప్రశాంత్ ల జర్నీ వీడియోలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే యావర్, ప్రశాంత్, శివాజీ ఇప్పటికే అత్యధిక ఓటింగ్ తో టాప్-3 లో ఉన్నారు. కానీ అమర్ దీప్, అంబటి అర్జున్, ప్రియాంకకి లీస్ట్ ఓటింగ్ పడుతోంది. అయితే ఇప్పటికి జరిగిన ఓటింగ్ ప్రకారం బాటమ్-2 లో.. అర్జున్, ప్రియాంక ఉన్నారు. అందుకే వారి జర్నీ వీడియోలని బిగ్ బాస్ త్వరగా చూపించాడేమోనని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీనికి కారణం కూడా ఉంది‌. హౌస్ లో ప్రతీ సీజన్ ఫినాలేకి టాప్-5 మాత్రమే ఉంటారు. అదే ప్రక్రియలో భాగంగా గతవారం శోభాశెట్టిని బయటకు పంపించేశారు బిగ్ బాస్. దాంతో హౌస్ లో ఇప్పుడు ఆరుగురు ఉన్నారు. ఇక మిగిలింది నాలుగు రోజులే కావడంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

మిడ్ వీక్ ఎలిమినేషన్ గనుక జరిగితే ప్రియాంక, అర్జున్ లలో ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే. ఎందుకంటే వీరికి ఓట్లు వేసేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. హౌస్ లో అంబటి అర్జున్ కన్నింగ్ గేమ్ ప్లాన్ అర్థమైంది కాబట్టి ప్రేక్షకులు అతనికి ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇక ప్రియాంక ఎప్పుడూ గ్రూప్, అమర్, శోభాశెట్టిలకి సపోర్ట్ చేయాలంటూ తన దాకా వస్తే తన స్వార్థమే చూసుకుంటు చాలావరకు హౌస్ లో గొడవలు జరగడానికి ప్రధాన కారణం అయ్యింది. కిచెన్ లో తప్ప బయట ఎక్కువ కనిపించని ప్రియాంక ఆటలో గెలిచినవి తక్కువే. ఈమె సింపతీ డ్రామా కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. మరీ అర్జున్, ప్రియాంకల జర్నీ వీడియోలు మొదట చూపించడానికి ప్రధాన కారణం వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలనేదే రీజన్ లా అనిపిస్తుంది. మరి జర్నీ వీడియోలని బట్టి చూస్తే అంబటి అర్జున్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ ట్విస్ట్ ఇస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రియాంక బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.