English | Telugu
శివాజీని బీట్ చేయలేకపోతున్న ప్రశాంత్.. టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నాడా?
Updated : Dec 12, 2023
ఓటింగ్ లో శివాజీ హవా నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్-7 లో మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఫెయిర్ కంటెస్టెంట్ గా శివాజీ రికార్డులు సృష్టిస్తున్నాడు. అతని మైండ్ గేమ్, స్ట్రాటజీ, మాటతీరుతో జనాలే కాదు హోస్ట్ నాగార్జున కూడా ఫిధా అయ్యారు. ఎంతలా అంటే శివాజీ చేతికి గాయం అయిందని మిగతా హౌస్ మేట్స్ అందరు ఆడట్లేదని అన్నా సరే శివాజీకే మద్దతు ఇస్తూ వచ్చారు. రెండు మూడు సార్లు కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి మరీ మోటివేషన్ ఇచ్చి మరీ ఉండేలా చేశారు బిగ్ బాస్.
సీజన్ విన్నర్‌గా నిలిచేందుకు అవకాశం ఉన్న వారిలో శివాజీ ఒకడు. శివాజీ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడం మాత్రం శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన శివాజీ ప్రస్తుతం టైటిల్ రేసులో గట్టి పోటీ ఇస్తున్నాడు. నిజానికి ఫ్యామిలీ వీక్ వరకు శివాజీనే హాట్ ఫేవరెట్‌గా ఉన్నాడు. ఆ వీక్‌లో తన పెద్ద కొడుకు వెంకట్ హౌస్‌లోకి వచ్చినప్పుడు శివాజీ ఎమోషనల్ అవ్వడంతో ఆడియన్స్‌కి శివాజీ మరింత కనెక్ట్ అయ్యాడు. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న ఆ బాండింగ్‌ను అందరికీ గుర్తు చేసి మరింత ఎమోషనల్ చేసాడు బిగ్ బాస్. అయితే ఫ్యామిలీ వీక్ ఈసారి పదవ వారంలోనే జరిగింది. ఇక హౌస్ లో అందరితో మంచి రాపో ఉంది కేవలం శివాజీకే అని నిన్నటి జర్నీ వీడియోలో స్పష్టత వచ్చేసింది. చాణక్యుడిగా, పల్లవి ప్రశాంత్, యావర్ లకి గురువుగా ఎంతో మంది అభిమానాన్ని పొందాడు శివాజీ. దీంతో అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో శివాజీ ఉన్నాడు.
అమర్ దీప్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్టే ఎందుకంటే గతవారం ముందు వరకు మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్.. పద్నాలుగవ వారంలో ప్రశాంత్‌తో బిహేవియర్ చూసి ఆడియన్స్ షాకయ్యారు. ప్రశాంత్‌ను కొరకడం, తోసేయడం, తోసుకుంటూ రూడ్‌గా బిహేవ్ చేయడంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువైంది. అంతకుముందు వరకు ఫౌల్ గేమ్స్ తో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన అమర్ దీప్.. ప్రియాంక, శోభాల సపోర్ట్ తో ఇన్నివారాలు ఉన్నాడనేది వాస్తవం. గత ఆరు వారాలుగా దత్తపుత్రిక శోభాశెట్టిని కాపాడిన బిగ్ బాస్ గతవారం తనని ఎలిమినేట్ చేసి జనాలకి ఓట్లు వేయాలనే ఆసక్తిని కలుగజేసారు. ఇక రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. గ్రామాల నుండి అత్యధిక ఓట్లు వస్తున్నా.. శివాజీని బీట్ చేయలేకపోతున్నాడు ప్రశాంత్. ఇక ప్రియాంక, అర్జున్ బాటమ్-2 లో ఉన్నారు.