English | Telugu

విష్ణుప్రియ, రీతూ పరువు తీసిన ప్రదీప్!

ఆహా ఓటిటి వేదికపై కొత్త మూవీస్ తో పాటు గేమ్ షోస్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాంటి ఒక ఫేమస్ గేమ్ షో ఐన 'సర్కార్ 2' లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ స్టేజి మీదకి నలుగురు తెలివైన వాళ్ళను తీసుకొస్తున్నట్లు చెప్పి వాళ్ళే వీళ్ళు అంటూ దివి, విష్ణుప్రియ, రీతుచౌదరీ, భానుశ్రీని పరిచయం చేశాడు. ఇక ఈ నలుగురు కలిసి డాన్స్ చేస్తూ స్టేజి మీదకు వచ్చారు. "ఎక్కడైనా నలుగురు కలిసి డాన్స్ చేస్తారు కానీ వీళ్ళ నలుగురు వేరు" అన్నాడు ప్రదీప్. ఆ డైలాగ్ కి విష్ణు పగలబడి నవ్వింది. "మీరేం కంగారు పడకండి, విష్ణు నవ్వు జనరేటర్ శబ్దంలా ఉంటుంది" అని పంచ్ వేశాడు ప్ర‌దీప్‌. ఆ నలుగురితో 'సర్కారు వారి పాట' పాడించాడు.

ఇక ఫైనల్ గా 'జీపీఎస్' అంటే ఫుల్ ఫార్మ్ ఏమిటి అని అడిగాడు ప్ర‌దీప్‌. కానీ ఎవరూ ఆన్సర్ చెప్పలేక హైదరాబాద్ లో ఉన్న క్లబ్బుల పేర్లు చెప్పారు. "సారీ.. నలుగురు తెలివైన వాళ్ళను తెచ్చాను అనుకున్నా కానీ కాదు" అంటూ విష్ణు, రీతూ పరువు తీసేసాడు ప్రదీప్. ఈ మధ్య నిహారిక, నవదీప్, సదా, విశ్వక్ సేన్, సాయి పల్లవి, రానా, అడివి శేష్, శోభిత ఇలా ఎంతో మందితో ఈ గేమ్ షో ఆడించాడు ప్రదీప్. ప్రతీ ఎపిసోడ్ లో ఫోర్ రౌండ్స్ ఉంటాయి. ఫైనల్ రౌండ్ వరకు ఎవరు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్తూ ఆడతారో వాళ్ళు గెలిచినట్టు. ఇక ఈ షోకి బిగ్ స్క్రీన్ నుంచి కూడా చాలా మంది సెలెబ్రిటీస్ వచ్చి ఈ సర్కారు వారి పాటలో పార్టిసిపేట్ చేశారు. మ‌రోవైపు ప్రదీప్ పాపులర్ డాన్స్ షో 'ఢీ 14'కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.