English | Telugu

మ‌ల్లెమాల‌పై కిర్రాక్ ఆర్పీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేదిక మీదకు ఏమీ లేకుండా వచ్చి, ఇప్పుడు ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది వున్నారు. అలాంటి వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకరు. ఇటీవల అత‌ను ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. "మల్లెమాల సంస్థ ఎవరికీ దేవుడు కాదు. మల్లెమాల అనేది ఒక పదం మాత్రమే. దాని వెనక ఒక మనిషి ఉంటాడు. వాళ్ళు పక్కా కమర్షియల్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు చేసేది వ్యాపారం, నాగబాబు గారు చేసేది వ్యవహారం" అంటూ తన మనసులోని మాటల్ని చెప్పేసాడు ఆర్పీ.

"నాగబాబు గారితో బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. స్థాయి చూడకుండా ప్రతీ ఒక్కరికీ సాయం చేసే మనసున్న వ్యక్తి. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి అలా కాదు. ఆయన ఎలాంటి హెల్ప్ ఎవరికీ ఎప్పుడూ చేయలేదు, ఎప్పటికీ చేయరు కూడా" అంటూ చెప్పాడు. "నేను మల్లెమాలను తిట్టినందుకు చాలా మంది నా మీద ఫైర్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నా.. నాకు ఈటీవీ అంటే, మల్లెమాల అంటే, జబర్దస్త్ అంటే, శ్యాంప్రసాద్ రెడ్డి అంటే అస్సలు ఇష్టం ఉండదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

"ఈ సంస్థలో విలువలు ఉండవ్.ఇప్పటికే ఉన్న విలువలు కూడా దిగజారిపోయాయి. మొదట్లోనే ఈ విషయాలన్నీ తెలిస్తే అసలు ఈ సంస్థకు వచ్చేవాడిని కాదు. కానీ ఇన్ని స్కిట్స్ వేశాక ఒక్కో విషయం బయటపడుతూ ఉంటే తెలిసింది. ఇక మల్లెమాల సంస్థలోదొరికే ఫుడ్ చాలా ఘోరం. ఎలా అంటే చంచ‌ల్‌గూడ, చర్లపల్లి, అండమాన్ జైళ్లల్లో మర్డర్స్ చేసిన వాళ్లకు పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో అంతకంటే ఘోరంగా ఉంటుంది. చిప్పకూడు అంతకంటే ఘోరం" అంటూ మల్లెమాలలో గుట్టును బయటేసాడు ఆర్పీ. "మల్లెమాల సంస్థకు బయట పని చేసే కూలీలన్నా, లోపలున్న టీం లీడర్లు అన్నా ఒకటే" అంటూ ఎన్నో కీలక విషయాలు చెప్పాడు కిర్రాక్ ఆర్పీ. ఈ సంస్థలో ఇన్ని లోటుపాట్లు ఉండడం వలనే కామోసు అందరూ ఈ షోని ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నారంటూ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.