English | Telugu

మ‌లేసియాలో ఆర్య, అనును వెంటాడిన గ్యాంగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీనియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఆత్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ ట్విస్ట్ లు, మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, రామ్‌జ‌గ‌న్‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, అనుషా సంతోష్‌, సందీప్‌, మ‌ధుశ్రీ త‌దిత‌రులు న‌టించారు.

రాగ‌సుధ త‌ప్పు బ‌య‌ట‌ప‌డ‌టంతో త‌ను జైలుకి వెళుతుంది. ఇన్నాళ్లూ ఆఫీసు, కోర్టు కొడ‌వ‌ల‌తో గ‌డిపిన ఆర్య‌, అను మ‌లేసియాకు వెకేష‌న్ కి వెళ్లాల‌ని ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఈ విష‌యం తెలిసి మాన్సీ త‌ను కూడా వ‌స్తాన‌ని గొడ‌వ చేస్తుంది. క‌డుపుతో వున్న వాళ్లు ప్ర‌యాణం చేయ‌కూడద‌ని చెప్ప‌డంతో తాను క‌డుపుతో లేన‌ని సీరియ‌స్ గా చెప్పినా ఆర్యవ‌ర్థ‌న్‌, అత‌ని త‌ల్లి అర్థం చేసుకోరు. త‌ను ఆవేశంగా చెబుతోంద‌ని భావిస్తారు. మాన్సీని వారిస్తారు.

ఇక మాన్సీ ఇలా కావ‌డానికి కార‌ణం ఆమె త‌ల్లి షీలా అని ఆర్య త‌ల్లి, నీర‌జ్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి త‌న‌ని ఇంటి నుంచి పంపించేయాల‌ని ఆర్య‌తో చెబుతారు. ఈ విష‌యం విన్న అను, చాటుగా విన్న మాన్సీ కంగారు ప‌డ‌తారు. అయినా స‌రే త‌న‌ని ఇంటి నుంచి పంపించేయాల్సిందేన‌ని ఆర్య కూడా చెప్ప‌డంతో మాన్సీ మ‌రింత‌గా భ‌య‌ప‌డుతుంది. అయితే త‌న‌కు స‌పోర్ట్ చేస్తే త‌న‌తో పాటు న‌న్ను కూడా బ‌య‌టికి గెంటేస్తార‌ని, త‌న‌కు అస్సలు స‌పోర్ట్ చేయ‌కూడద‌ని మాన్సీ నిర్ణ‌యించుకుంటుంది.

ఇంత‌లో షీలా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం దుర్గమాల ధ‌రించాన‌ని అబ‌ద్ధం చెప్పి కాషాయం చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిస్తుంది. ఆమెలో ఈ మార్పుని చూసి ఆర్య త‌ల్లి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటుంది. క‌ట్ చేస్తే జెండే ఫ్లైట్ టికెట్స్ తీసుకురావ‌డంతో అను - ఆర్య మ‌లేసియా బ‌య‌లుదేర‌తారు.. ఎయిర్ పోర్ట్ లో దిగాక వీళ్ల‌ని రిసీవ్ చేసుకున్న ఓ వ్య‌క్తితో అక్క‌డి నుంచి కారులో బ‌యలు దేర‌తారు. వీళ్ల‌ని ఓ గ్యాంగ్ వెంటాడ‌టం మొద‌లు పెడుతుంది. అను - ఆర్య‌పై దాడికి ప్ర‌య‌త్నించింది ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.