English | Telugu

అమ్మాయిలకు ఇన్ని ఉంటాయని నాకు తెలీదు!

కమెడియన్ పంచ్ ప్రసాద్ జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. వెరైటీ డైలాగ్స్ తో ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. తరువాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ అందరినీ నవ్వించే ప్రసాద్ కొంత కాలం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి కొంత ట్రీట్మెంట్ అదీ చేయించుకుని సెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు తన వైఫ్ సునీతతో కలిసి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ షాపింగ్ లో ఎంజాయ్ చేసాడు. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు.

"సో మీకెప్పుడూ చెప్పేదే.. లేడీస్ షాపింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మనం ఉంటే బలైపోతాం . కాబట్టి నా వైఫ్ సునీత ఈ గోల్డ్ జ్యువెలరీ గురించి మొత్తం తానే హ్యాండిల్ చేస్తుంది.. ఇక్కడ కూర్చుని చూస్తుంటే అమ్మాయిలకు ఇన్ని ఉన్నాయా.. అబ్బాయిలకు ఏం లేవా ఒక్క చెయిన్ మాత్రమే ఉంటుందా అని ఫీల్ అవుతున్నాను.. అందుకే నేను బాధపడుతూ బయటికి వెళ్ళిపోతున్నాను" అని తన కూతురు తన్వితో కాసేపు వెంట్రిలాక్విజమ్ చేసి ఎంటర్టైన్ చేసాడు పంచ్ ప్రసాద్.

ఇక సునీత ఏ డ్రెస్ కి ఎలాంటి మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందో చూపించింది. ఇక పంచ్ ప్రసాద్ అంత సేపు కూర్చునికూర్చుని అప్పటికే నాలుగు టీలు వేసేశాడని, ఇంకెంత సేపు షాపింగ్ అన్నట్టుగా ముఖం పెట్టాడు అని చెప్పి ప్రసాద్ ఫేస్ ని చూపించింది సునీత. ఆ ఫేస్ చూస్తే గనక ఆడియన్సు నవ్వకుండా ఉండరు. ఇక ఫైనల్ గా "ఎంత నరకం చూపించారో వీళ్లంతా" ఈ వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్ తో అని వీడియోని ఎండ్ చేసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.