English | Telugu

ఎన్బీకే 'అన్‌స్టాపబుల్' షోకి పీకే!

నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అంతకుమించి 'అన్‌స్టాపబుల్' షో రెండో సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమైన 'అన్ స్టాపబుల్' షో సీజన్-1 ప్రేక్షకులకు కొత్త బాలయ్యని పరిచయం చేసింది. నిజ జీవితంలో బాలయ్య ఇలా ఉంటారా అంటూ ఆయన వ్యక్తిత్వానికి ఎందరో అభిమానులుగా మారిపోయారు.

ఇప్పుడు రెండో సీజన్ తో మరోసారి అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య. దీపావళి నుంచి రెండో సీజన్ ప్రసారమయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయనున్నారని న్యూస్ వినిపిస్తోంది.

'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ మోహన్ బాబుతో మొదలై, మహేష్ బాబుతో ముగిసింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ చంద్రబాబుతో మొదలై పవన్ కళ్యాణ్ తో ముగుస్తుందని అంటున్నారు. సీజన్-1లో అన్ని ఎపిసోడ్లు ఒకెత్తయితే మహేష్ పాల్గొన్న చివరి ఎపిసోడ్ మరో ఎత్తు. ఇప్పుడు సీజన్-2ని కూడా అదే స్థాయిలో గ్రాండ్ గా మొదలుపెట్టి, గ్రాండ్ గా ముగించాలి అనుకుంటున్నారట.

అందుకే మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబుని, చివరి ఎపిసోడ్ కి పవన్ ని తీసుకురాబోతున్నారట. ఇప్పటికే చంద్రబాబు ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే పవన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేస్తారని సమాచారం. బాలయ్య-పవన్ కలిస్తే ఆ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందోనంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.