English | Telugu

A1 ముద్దాయిగా పల్లవి ప్రశాంత్.. నన్ను క్షమించండి!

బిగ్ బాస్ సీజన్‌-7 ‌పదిహేనువారాల పాటు ఈ సాగి, ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ షోలో కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టుగా ప్రతీ వారం సాగుతూ చివరికి కామన్ మ్యాన్ గా వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కే దక్కింది.

బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టున్న ఈ రైతుబిడ్డ బిగ్ బాస్ టైటిల్ విజేత అయ్యాడు. నాగార్జున విజేత అని ప్రకటించగానే పట్టరాని సంతోషంతో‌ నోట‌ మాట రాకుండా ఎమోషనల్ అయ్యాడు. ‌బయటకు వచ్చాక తనకోసం వందలకొలదీ ప్రేక్షకులు రావడంతో వాళ్ళని చూసి ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. గ్రాంఢ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట జనాలు భారీగా రావడంతో ట్రాఫీక్ వాయిలెన్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే దానితో పాటు కొందరు అభిమానులు వాహనాల ధ్వంసం చేశారు. అమర్ దీప్ , గీతు రాయల్ కార్ పై దాడి చేసి ద్వంసం చేశారు. దాంతో పోలీసులకి కంప్లైంట్ చేసింది గీతు. జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసులో విన్నర్ ప్రశాంత్ ని A1 ముద్దాయిగా చేర్చి కేసు నమోదు చేశారట. అతడి సోదరుడు మనోహర్ ని పోలీసులు A2 గా, అతడి ఫ్రెండ్ వినయ్ ను A3, డ్రైవర్లు సాయి, రాజులని A4 గా చేర్చారని సమాచారం.

ట్రాఫిక్ వాయిలెన్స్ కి కారణం పల్లవి ప్రశాంత్ అని అతడిని పోలీసులు వెళ్ళమని చెప్పిన వెళ్ళలేదని అందుకే కేసు నమోదు చేశారంట. అయితే కార్లని ద్వంసం చేయడం కరెక్ట్ కాదని, ఒక గేమ్ షోని గేమ్ షోలాగా తీసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరుగుతున్న ఈ వార్ ని ఇంతటి ఆపాలని అంటున్నారు. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని అప్లోడ్ చేశాడు.‌ ఇందులో తను మాట్లాడుతూ.. ఆ రోజు రాత్రి చాలామంది యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు ఇంటర్వూ, ఫోటోలు కావాలని అడిగారు. తనకు ఓపిక ఉన్నంతవరకు ఇచ్చానని, అప్పటికే బాగా లేట్ అయిందని, ఆకలి అవుతుందని చెప్పాన. కానీ తర్వాత రమ్మని చెప్పానని ప్రశాంత్ అన్నాడంట కానీ మీడియా వాళ్ళు అది చెప్పకుండా తనని నెగెటివ్ చేయడానికి ఏదో చెప్తున్నారని ఎమోషనల్ అయ్యాడు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.